BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/black-fungus5a8ffc67-5cc3-4a9d-8185-6f1f15aced42-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/black-fungus5a8ffc67-5cc3-4a9d-8185-6f1f15aced42-415x250-IndiaHerald.jpgకరోనా బారిన కోలుకున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. తెలంగాణలో మ్యుకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)తో ఒక వ్యక్తి మృతిచెందారు. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతblack fungus;telangana;mohandas karamchand gandhi;district;nirmal;reddy;bhainsaతెలంగాణలో బ్లాక్ ఫంగస్.. ప్రజలు హడల్..!!తెలంగాణలో బ్లాక్ ఫంగస్.. ప్రజలు హడల్..!!black fungus;telangana;mohandas karamchand gandhi;district;nirmal;reddy;bhainsaFri, 14 May 2021 09:14:59 GMTకరోనా బారిన కోలుకున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. తెలంగాణలో మ్యుకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)తో ఒక వ్యక్తి మృతిచెందారు.  నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్న నిర్మల్‌ జిల్లా బైంసా డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులపై తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయని తెలిపారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని ఆయన వివరించారు. హైడోస్ స్టెరాయిడ్స్ వాడే కొందరిలో మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దని ఆయన సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>