WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhec5776552-947a-4542-b80c-93786b3f61bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhec5776552-947a-4542-b80c-93786b3f61bb-415x250-IndiaHerald.jpgఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవడానికి ముందుగా అతని స్నేహితులు ఎవరనేది తెలుసుకుంటే సరిపోతుంది. మన స్నేహితులు ఎలాంటి వారో తెలిస్తే మనము ఎలాంటి వారో ఇట్టే తెలుసుకోవచ్చు. మన అలవాట్లు ఏమిటి ? మన పద్ధతులు ఏమిటి ? అనేది స్పష్టంగా తెలుస్తుందని కొందరి అభిప్రాయం. VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;mithra;king;king 1;allu snehaవిజయం మీదే: మంచి స్నేహితుడిని ఎంచుకో ?విజయం మీదే: మంచి స్నేహితుడిని ఎంచుకో ?VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;mithra;king;king 1;allu snehaFri, 14 May 2021 21:00:00 GMTఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవడానికి ముందుగా అతని స్నేహితులు ఎవరనేది తెలుసుకుంటే సరిపోతుంది. మన స్నేహితులు ఎలాంటి వారో తెలిస్తే మనము ఎలాంటి వారో ఇట్టే తెలుసుకోవచ్చు. మన అలవాట్లు ఏమిటి ? మన పద్ధతులు ఏమిటి ? అనేది స్పష్టంగా తెలుస్తుందని కొందరి అభిప్రాయం. కొంతలో కొంత ఇది నిజం కూడా, స్నేహ బంధం చాలా గొప్పది, ఒకరి అలవాట్లు మరొకరు నేర్చుకుంటారు. ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు తోడుండి అండగా నిలబడతారు. మనల్ని ముందుండి నడిపిస్తారు. అయితే స్నేహితులను ఎంచుకునే సమయంలో చాలా విషయాలు ఆలోచించాల్సి ఉంది. వారి గుణ గణాలు, పద్ధతుల గురించి తెలుసుకోవాలి. మన స్నేహితులుగా మంచి వారినే ఎంచుకోవాలి.

చెడ్డ మిత్రులకన్నా అసలు మిత్రులు లేకపోవడమే ఉత్తమమన్నారు మార్టిన్ లూథర్ కింగ్. చెడ్డ మిత్రులను కనుక ఎంచుకుంటే  మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనం కూడా చెడు అలవాట్లకు మెల్లమెల్లగా దగ్గరయ్యే అవకాశం ఉంది. అవి మనకు హాని కూడా కలిగించవచ్చు. అదే ఒక మంచి స్నేహితుడిని ఎంచుకుంటే మీకు కష్ట నష్టాలలోనూ, మంచి చెడులలోనూ తోడుంటారు. బుద్ధిమంతులైన మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. మనం జీవితంలో మరింత అభివృద్ధి చెందడానికి వారు మనకు అన్ని రకాలుగా సహాయపడతారు.

భావం సరైనది అయితే ప్రేరణ సరిగ్గా వుంటుంది, ప్రేరణ సరియైనదయితే కార్యాచరణ సరిగ్గా వుంటుంది. కార్యాచరణ సరిగ్గా వుంటే విజయం మన సొంతమవుతుంది.  ఒక మంచి స్నేహితుడు మనకు ఉంటే, ప్రేరణ మన కార్యాచరణ సవ్యంగా ఉంటాయి. అలాగే మనకు గౌరవం కూడా లభిస్తుంది.  నేటి తరంలో చుట్టాలు లేనివారు ఉన్నారేమో కానీ, స్నేహితులు లేనివారు మాత్రం లేరు. అయితే ఇక్కడ విషయం ఎంత మంది స్నేహితులున్నారు అన్నది కాదు. ఎంత మంది మంచి స్నేహితులు ఉన్నారు అన్నది ప్రధానం. మన స్నేహితులను చూస్తే మనం ఏంటో అంచనా వేస్తుంది ఈ సమాజం. కాబట్టి మంచి స్నేహితులను ఎంచుకోండి. మంచి గుర్తింపు తెచ్చుకోండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య రెండవ వైపు చూస్తే... ?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>