PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/work-from-hotel62720344-381e-4202-afac-4ec16d6ca46b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/work-from-hotel62720344-381e-4202-afac-4ec16d6ca46b-415x250-IndiaHerald.jpgగతేడాది కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దాదాపు ఎడాదిన్నర నుంచి పలు రంగాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ పలు సంస్థలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. అయితే కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్‌ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.Work From Hotel;central government;house;coffee;indian;coronavirusవర్క్ ఫ్రమ్ హోటల్ గురించి మీకు తెలుసా..?వర్క్ ఫ్రమ్ హోటల్ గురించి మీకు తెలుసా..?Work From Hotel;central government;house;coffee;indian;coronavirusFri, 14 May 2021 11:00:00 GMTగతేడాది కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దాదాపు ఎడాదిన్నర నుంచి పలు రంగాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ పలు సంస్థలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. అయితే కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్‌ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలు బోర్ అంటూ పనిపై నిరాశను వ్యక్త పరుస్తున్నారు. ఈ సమయంలోనే సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయపెడుతోంది.

ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొడితే.. ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ ఉందంటూ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ఈ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. గతేడాది కూడా పాపులర్ అయింది. ఇప్పుడు ఐఆర్‍సీటీసీ టూరిజం ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. కేరళలోని హోటళ్లలో కొన్ని రోజుల పాటు ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకునేందుకు ప్యాకేజీని ప్రకటించింది.

వర్క్ ఫ్రమ్ హోటల్’ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,126. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధరగా ప్రకటించింది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ఐదు రాత్రులు హోటల్‌లో బస, మూడు పూటలా భోజనం, రెండు సార్లు టీ లేదా కాఫీ, వైఫై సదుపాయం ఉంటుంది. కేరళలోని మున్నార్, అలెప్పీ, వాయనాడ్, తెక్కడి, కొచ్చిన్, కుమారకోమ్, కోవలం లాంటి ప్రాంతాల్లోని హోటళ్లల్లో ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ గడువు ఐదు రోజులు మాత్రమే. తరువాత పొడిగించుకోవాలంటే డబ్బులు కట్టి చేసుకోవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినీ పరిశ్రమకు బిగ్ షాక్..కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి..!!

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>