PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse6d64d92-d7dc-49b6-b654-19a03cf426c3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruse6d64d92-d7dc-49b6-b654-19a03cf426c3-415x250-IndiaHerald.jpgకొన్ని నెలల క్రితం వరకూ అమెరికాలో కరోనా బీభత్సం సృష్టించింది. రోజూ లక్షల్లో కొత్త కేసులు వచ్చేవి.. వేల మంది పిట్టల్లా రాలిపోయే వారు.. ఆ తర్వాత పకడ్బందీ వ్యాక్సీన్ ప్రణాళికతో అమెరికా ముందుకు సాగింది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 70 శాతం మందికిపైగా వ్యాక్సీన్ తీసుకున్నారు. వ్యాక్సీన్ల విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది అమెరికా. అందుకే ఇప్పుడు అక్కడ కరోనా ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం అమెరికా ఆంక్షలు సడలించింది. ఈ మేరకు ఆంక్షలు సడలిస్తూ అమెరికా వ్యాధిcoronavirus;american samoa;central government;fatherవావ్.. ఇక అమెరికాలో మాస్కుల్లేకుండా తిరిగేయొచ్చట..?వావ్.. ఇక అమెరికాలో మాస్కుల్లేకుండా తిరిగేయొచ్చట..?coronavirus;american samoa;central government;fatherFri, 14 May 2021 07:05:40 GMTకొన్ని నెలల క్రితం వరకూ అమెరికాలో కరోనా బీభత్సం సృష్టించింది. రోజూ లక్షల్లో కొత్త కేసులు వచ్చేవి.. వేల మంది పిట్టల్లా రాలిపోయే వారు.. ఆ తర్వాత పకడ్బందీ వ్యాక్సీన్ ప్రణాళికతో అమెరికా ముందుకు సాగింది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 70 శాతం మందికిపైగా వ్యాక్సీన్ తీసుకున్నారు. వ్యాక్సీన్ల విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది అమెరికా. అందుకే ఇప్పుడు అక్కడ కరోనా ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు.

వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం అమెరికా ఆంక్షలు సడలించింది. ఈ మేరకు ఆంక్షలు సడలిస్తూ  అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం పని ప్రదేశాలు, పాఠశాలల్లో మాస్కు లేకుండా తిరిగొచ్చట. అయితే ఈ నిబంధన పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులకు మాత్రమే సుమా. అయితే పూర్తి స్థాయిలో వ్యాక్సీన్ తీసుకున్నా సరే.. జన సందోహం ఉన్న ప్రాంతాలు, ఆస్పత్రుల్లో మాత్రం తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే.

కరోనా క్రమంగా తగ్గడం.. వ్యాక్సినేషన్ పెరగడంతో కరోనా ఆంక్షలు సడలించాలని సీడీసీని ఇటీవలే బైడెన్‌ ప్రభుత్వం కోరింది. బైడెన్ ప్రభుత్వం వినతి మేరకు మాస్కు లేకుండా తిరిగేందుకు సీడీసీ అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడిన దేశాల్లో అమెరికా ఒకటి. ఎక్కువగా కేసులు, మరణాలు నమోదైన అమెరికా ఇప్పుడు మాస్కులు లేకుండా తిరగొచ్చు అనే స్థాయికి వెళ్లింది. గతంలో అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టించింది. కరోనా విజృంభణతో అమెరికన్లు ఒక దశలో భయకంపితులయ్యారు.

అమెరికాలో వ్యాక్సినేషన్‌కు ముందు అక్కడ నిమిషానికొకరిని కరోనా వైరస్‌ బలితీసుకునేది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. హాస్పటల్స్‌ అన్ని కరోనా పేషంట్లతో నిండిపోయేవి. హాస్పిటల్స్‌లో చాలినన్ని బెడ్స్‌ లేకపోవడంతో చర్చిలను, హోటళ్లను, రెస్ట్‌ రూమ్‌లను కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ఉపయోగించారు. చివరాఖరికి వాహనాల పార్కింగ్ ప్లేస్‌ల్లోనూ పడకలు ఏర్పాటు చేశారు. అలాంటి అమెరికా ఇప్పుడు మాస్కుల్లేకుండా తిరగొచ్చు అనే స్థాయికి చేరింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వేమగిరి: వరుస హత్యల కలకలం

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>