MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcd53f1e6-deab-4924-9d5c-588c210bf500-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcd53f1e6-deab-4924-9d5c-588c210bf500-415x250-IndiaHerald.jpg2011లో సరిగ్గా ఇదే రోజున రంగం అనే సినిమా రిలీజ్ అయింది.. డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినా తమిళంలో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమా ఎవరూ ఊహించనంత స్పందన తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా కన్నుమూసిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.. రాజకీయ నాయకులు అధికారం కోసం ఎలాంటి నీచానికి అయినా తెగబడతారు అనే పాయింట్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ముందుగా కె.వి.ఆనంద్ మరో హీరోని అనుకున్నారట. అప్పటికే స్టార్ హీరోగా ఉన్న శింబు ఈ సినిమాలో హీరోగాtollywood;prakash raj;anand malayalam actor;jeeva;raj;tollywood;cinema;telugu;tamil;fort;hero;anand deverakonda;vస్టార్ హీరో వద్దనుకున్న సినిమా మరొకరిని స్టార్ ని చేసింది!స్టార్ హీరో వద్దనుకున్న సినిమా మరొకరిని స్టార్ ని చేసింది!tollywood;prakash raj;anand malayalam actor;jeeva;raj;tollywood;cinema;telugu;tamil;fort;hero;anand deverakonda;vFri, 14 May 2021 14:00:00 GMT2011లో సరిగ్గా ఇదే రోజున రంగం అనే సినిమా రిలీజ్ అయింది.. డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినా తమిళంలో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమా ఎవరూ ఊహించనంత స్పందన తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా కన్నుమూసిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.. రాజకీయ నాయకులు అధికారం కోసం ఎలాంటి నీచానికి అయినా తెగబడతారు అనే పాయింట్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ముందుగా కె.వి.ఆనంద్ మరో హీరోని అనుకున్నారట. 


అప్పటికే స్టార్ హీరోగా ఉన్న శింబు ఈ సినిమాలో హీరోగా ఎంపిక కాగా ఆయనతో కొంత భాగం షూటింగ్ కూడా జరిపారు అట. అనుకోని కారణాలతో శింబు తప్పుకోవడంతో శింబు స్థానంలోకి జీవా వచ్చి చేరాడు. అలా అలా ఒక స్టార్ హీరో తప్పుకోవడంతో వచ్చి చేరిన మరో హీరో స్టార్ హీరో హోదా సంపాదించాడు. ఈ సినిమాతోనే రాధ కుమార్తె కార్తీక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 


పియా బాజ్ పేయి, అజ్మల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు లాంటి ఇతర నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇక శింబు కూడా ఈ విషయాన్ని కె.వి.ఆనంద్ మరణించినప్పుడు తన సంతాప సందేశంలో వివరించారు. తాము ఇద్దరం కలిసి ఆ సినిమాకి పని చేయాల్సి ఉందని అనుకోని కారణాల కారణంగా అది జరగలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా ఆనంద శింబు కోసం మరో కధ సిద్ధం చేసి చెప్పడంతో అది కూడా చేయాలని భావించారట. కానీ ఆ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"లాక్ డౌన్" సమయంలో ఇంట్లో బోర్ కొడుతోందా ?

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>