MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa8fa90a93-0f22-49dc-8614-0dc3c1348b72-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa8fa90a93-0f22-49dc-8614-0dc3c1348b72-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో భాగంలో సుకుమార్ ట్రేడ్ మార్క్ అయిన ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీtollywood;katrina kaif;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;disha patani;geetha;prasad;rashmika mandanna;sukumar;urvashi;bollywood;cinema;sangeetha;producer;producer1;heroine;shradda kapoor;arjun 1పుష్ప కోసం మరో స్టార్ హీరోయిన్?పుష్ప కోసం మరో స్టార్ హీరోయిన్?tollywood;katrina kaif;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;disha patani;geetha;prasad;rashmika mandanna;sukumar;urvashi;bollywood;cinema;sangeetha;producer;producer1;heroine;shradda kapoor;arjun 1Fri, 14 May 2021 15:22:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో భాగంలో సుకుమార్ ట్రేడ్ మార్క్ అయిన ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని అంటున్నారు. ముందు నుంచి ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక బాలీవుడ్ భామను తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దిశా పటాని మొదలు కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్ళతో ఐటమ్ సాంగ్ చేయించాలని భావించినా కుదరకపోవడంతో చివరికి ఊర్వశి రౌతేలాతో ఐటెం సాంగ్ ఫైనల్ చేశారని ప్రచారం జరిగింది. 

అయితే అదేమీ నిజం కాదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో భాగం గురించి మాట్లాడిన నిర్మాత ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజ హెగ్డే లేదా దిశాపటానీ తో సంప్రదింపులు జరుపుతున్నామని ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి చేత చేయిస్తామని చెప్పుకొచ్చారు. అలా ఈ సినిమా రెండో భాగం మీద కూడా ఇప్పటి నుంచే అంచనాలు పెంచేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>