MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-08f9afbd-0f28-4996-ac11-fa1048e33ea8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-08f9afbd-0f28-4996-ac11-fa1048e33ea8-415x250-IndiaHerald.jpg‘నిశ్శబ్దం’ మూవీ తరువాత అనుష్క నటిస్తున్న ఒక్క సినిమా కూడ ప్రస్తుతం సెట్స్ పై లేదు. ‘రారా క్రిష్నయ్య’ మూవీ దర్శకుడు మహేష్ నవీన్ పోలిశెట్టి అనుష్కల ను జంటగా చేసి నిర్మించవలసిన మూవీ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈమూవీలో అనుష్క 40 సంవత్సరాల మహిళగా కనిపిస్తే 25 సంవత్సరాల యువకుడుగా నవీన్ పోలిశెట్టి కనిపిస్తాడు.వీరిద్దరి మధ్య నడిచే ఒక విచిత్ర ప్రేమ కథాంశం చుట్టూ ఈమూవీ తిరుగుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగా అనుష్క లేటెస్ట్ లుక్ ఇలా ఉంది అంటూ సోషల్ మీడియాలో హడావanushka;;mahesh;anoushka;naveen polishetty;prema;tiru;singapore;cinema;love;heroine;zeroఅనుష్క తీరు పై ఆందోళన చెందుతున్న అభిమానులు !అనుష్క తీరు పై ఆందోళన చెందుతున్న అభిమానులు !anushka;;mahesh;anoushka;naveen polishetty;prema;tiru;singapore;cinema;love;heroine;zeroFri, 14 May 2021 08:00:00 GMT‘నిశ్శబ్దం’ మూవీ తరువాత అనుష్క నటిస్తున్న ఒక్క సినిమా కూడ ప్రస్తుతం సెట్స్ పై లేదు. ‘రారా క్రిష్నయ్య’ మూవీ దర్శకుడు మహేష్ నవీన్ పోలిశెట్టి అనుష్కల ను జంటగా చేసి నిర్మించవలసిన మూవీ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈమూవీలో అనుష్క 40 సంవత్సరాల మహిళగా కనిపిస్తే 25 సంవత్సరాల యువకుడుగా నవీన్ పోలిశెట్టి కనిపిస్తాడు.


వీరిద్దరి మధ్య నడిచే ఒక విచిత్ర ప్రేమ కథాంశం చుట్టూ ఈమూవీ తిరుగుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగా అనుష్క లేటెస్ట్ లుక్ ఇలా ఉంది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఒక ఫోటో చూసి అనుష్క అభిమానులు తీవ్రంగా టెన్షన్ పడిపోతున్నారు.


ఈ ఫోటోలో అనుష్క ఎక్కడా హీరోయిన్ లుక్ లో కాకుండా చాల సాదాసీదా గా కనిపిస్తోంది. దీనికితోడు ఈ ఫోటోలో అనుష్క మొఖంలో ఎక్కడా గ్లో కనిపించక పోవడంతో తిరిగి అనుష్కక కు ఏమైంది అంటూ కామెంట్స్ ప్రారంభం అయ్యాయి. ‘సైజ్ జీరో’ మూవీ తరువాత అనుష్క శరీరంలో వచ్చిన మార్పులు ఇప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు అన్నమాట వాస్తవం.


ఇది ఇలా ఉంటే అనుష్క సింగపూర్ కు చెందిన ఒక వ్యాపార వేత్తను పెళ్లాడబోతోందని అయితే ఆ వ్యాపార వేత్త అనుష్క కంటే వయసులో చిన్నవాడని అన్న వార్తల హడావిడి కూడ జరిగింది. కానీ ఎప్పటిలాగే ఈ వార్తల పై కూడ అనుష్క తన మౌనాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఆ వార్తల హడావిడి తగ్గిపోయి ఇప్పుడు లేటెస్ట్ గా అనుష్క కొత్త లుక్ ఇదే అంటూ జరుగుతున్న ప్రచారం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఈ ఫోటో ఇప్పటిది కాదనీ గతంలో అనుష్క తన బరువును తగ్గించుకోవడానికి తరుచు బెంగుళూరు లోని ఒక జిమ్ముకు వెళ్ళిన సందర్భంలో అజ్ఞాతంగా ఒక అభిమాని తీసిన ఫోటో అయి ఉండవచ్చు అంటూ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వేమగిరి: వరుస హత్యల కలకలం

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>