PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dmk-stalin-latest-news12018f58-562e-4c6e-9b1e-9840a6bdc380-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dmk-stalin-latest-news12018f58-562e-4c6e-9b1e-9840a6bdc380-415x250-IndiaHerald.jpgజూన్ రెండోవారంలో త‌మిళ‌నాడు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చిన డీఎంకే ఈ మూడుస్థానాల‌ను సునాయాసంగా గెలుచుకోగ‌లుగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో డీఎంకేకు ఏడుగురు స‌భ్యులున్నారు. ఈ మూడు కైవ‌సం చేసుకుంటే ప‌దిస్థానాల‌కు బ‌లం పెరుగుతుంది. dmk, stalin, latest news;udhayanidhi stalin;congress;jaan;assembly;central government;june;stalin;john;partyజూన్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు?జూన్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు?dmk, stalin, latest news;udhayanidhi stalin;congress;jaan;assembly;central government;june;stalin;john;partyFri, 14 May 2021 15:09:00 GMT

జూన్ రెండోవారంలో త‌మిళ‌నాడు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చిన డీఎంకే ఈ మూడుస్థానాల‌ను సునాయాసంగా గెలుచుకోగ‌లుగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో డీఎంకేకు ఏడుగురు స‌భ్యులున్నారు. ఈ మూడు కైవ‌సం చేసుకుంటే ప‌దిస్థానాల‌కు బ‌లం పెరుగుతుంది.

మూడూ సీట్లూ గెలుచుకోనున్న డీఎంకే
ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో డ్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే) పార్టీకి ఏడుగురు స‌భ్యులున్నారు. కేపీ మునుస్వామి, వైద్య‌లింగం ఇద్ద‌రూ ఇటీవ‌ల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొంద‌డంతో రెండు ఖాళీ అయ్యాయి. 2019లో అన్నాడీఎంకే త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎంపికైన మ‌హ్మ‌ద్ జాన్ మార్చిలో మృతిచెందారు. దీంతో ఖాళీఅయిన మూడు స్థానాల‌కు జూన్ రెండోవారంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీఈసీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. బోడినాయ‌క‌నూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అన్నాడీఎంకే కీల‌క‌నేత ప‌న్నీర్‌సెల్వంపై ఓట‌మిపాలైన తంగ త‌మిళ్‌సెల్వ‌న్‌, మోడ‌కురిచ్చి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌ల్పతేడాతో ఓట‌మిపాలైన డీఎంకే సీనియ‌ర్ మ‌హిళా నేత సుబ్బుల‌క్ష్మి జ‌గ‌దీశ‌న్ ఈ రెండు స్థానాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్య‌మంత్రి స్టాలిన్ కూడా వీరిద్ద‌రినీ ఎంపిక‌చేయ‌డానికి మొగ్గుచూపుతున్నారు. మ‌రో సీటును గెలుచుకోగ‌లిగే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆ సీటును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వ‌చూపారు. అయితే కాంగ్రెస్ పార్టీ పోటీచేయ‌డానికి ఆస‌క్తిచూప‌డంలేద‌ని తెలుస్తోంది. దీంతో అధికార డీఎంకేనే ఈ మూడుసీట్ల‌ను సునాయాసంగా గెలుచుకునే అవ‌కాశాలు ప్ర‌స్ఫుటంగా ఉన్నాయి.

స‌మ‌రోత్సాహంలో డీఎంకే
ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మిత్ర‌పక్షాల‌తో క‌లిసి డీఎంకే అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మంత్రివ‌ర్గాన్ని కూడా ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి స్టాలిన్ అధికారంలోకి వ‌చ్చీరాగానే లాక్‌డౌన్ ప్ర‌క‌టించి అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. త‌మిళ‌నాడులో క‌రోనా గొలుసును చేధించ‌డానికి లాక్‌డౌన్ ఒక‌టే ప‌రిష్కార‌మ‌ని స్టాలిన్ ప్ర‌క‌టించారు. క‌రోనాపై ముందుండి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్ కి మూడునెల‌ల ప్రోత్సాహ‌కాలు కూడా ప్ర‌క‌టించ‌డంతో అన్నివ‌ర్గాల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

కేక పుట్టిస్తున్న సిద్ధార్థ్ శుక్లా.."Broken But Beautiful 3" టీజర్ విడుదల..!!

శ్రీరెడ్డి ఎపిసోడ్ పై పరోక్షంగా స్పందించిన హీరో రానా తమ్ముడు..

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>