Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/vijay-sethupathi0493bc76-a17a-447e-83d0-8c42cef2ed04-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/vijay-sethupathi0493bc76-a17a-447e-83d0-8c42cef2ed04-415x250-IndiaHerald.jpgవిలక్షణ నటుడిగా, ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి పూర్తి న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్‌గా విజయ్ సేతుపతికి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించి సత్తా చాటాడు. దీంతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ చిత్రాల్లో అధికంగా నటించిన విజయ్ సేతుపతి ఈ మధ్య కాలంలో డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా..vijay sethupathi;rana;geetha;rachana;ravi anchor;sethu;soori;vijay;vijay sethupathi;korea, south;cinema;sangeetha;telugu;tamil;village;court;producer;love;mla;director;comedy;husband;producer1;local language;joseph vijay;masala;massరివ్యూ: విజయ్ సేతుపతి ఆహా అనిపించాడా..?రివ్యూ: విజయ్ సేతుపతి ఆహా అనిపించాడా..?vijay sethupathi;rana;geetha;rachana;ravi anchor;sethu;soori;vijay;vijay sethupathi;korea, south;cinema;sangeetha;telugu;tamil;village;court;producer;love;mla;director;comedy;husband;producer1;local language;joseph vijay;masala;massFri, 14 May 2021 16:34:30 GMTచిత్రం: విజయ్‌ సేతుపతి
నటీనటులు: విజయ్‌ సేతుపతి, రాశీఖన్నా, నివేదా పేతురాజ్‌, సూరి, రవికిషన్‌, అశుతోష్‌ రానా తదితరులు
సంగీతం: వివేక్‌ మర్విన్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌ వేల్‌రాజ్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌
నిర్మాత: భారతీరెడ్డి
రచన, దర్శకత్వం: విజయ్‌ చందర్‌
బ్యానర్‌: విజయ ప్రొడక్షన్స్‌
విడుదల: ఆహా

విలక్షణ నటుడిగా, ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి పూర్తి న్యాయం చేయగలిగే ఆర్టిస్ట్‌గా విజయ్ సేతుపతికి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించి సత్తా చాటాడు. దీంతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ చిత్రాల్లో అధికంగా నటించిన విజయ్ సేతుపతి ఈ మధ్య కాలంలో డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2019లో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్‌గా తమిళంలో తెరకెక్కిన ‘సంగతమిజన్’ తాజాగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాఫ్ ఫాం ఆహా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసింది. మరి ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా విజయ్‌ సేతుపతి ఏ స్థాయి నటన కనబరిచాడు..? ఈ చిత్ర కథ ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

స్టోరీ: చరణ్‌(విజయ్ సేతుపతి), అతడి స్నేహితుడు (సూరి)కి సినిమాల్లో నటించాలని కోరిక. ఆ కోరికతోనే ఇద్దరూ సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చేస్తారు. ఒకరోజు సరదాగా పబ్‌కు వెళ్లిన చరణ్‌కు కమలిని(రాశీఖన్నా) పరిచయం అవుతుంది. ఫొటోగ్రఫీ కోర్సు చదువుతున్న కమలిని.. ప్రాజెక్టులో భాగంగా చరణ్‌ ఉండే ఏరియాలో పరిస్థితులను ఫొటో తీసేందుకు వెళ్తుంది. అలా వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు రామాపురం అనే గ్రామంలో కాపర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి బిజినెస్‌మెన్‌ అయిన సంజయ్‌(రవికిషన్‌) ప్రయత్నిస్తుంటాడు. అందుకు స్థానిక ఎమ్మెల్యే చంటబ్బాయ్‌(అసుతోష్‌ రాణా) సహాయం చేస్తాడు. అయితే ఆ ఊరి ప్రజలు కోర్టుకు వెళ్లడంతో ఫ్యాక్టరీ పనులు ఆగిపోతాయి. తన కుమార్తె కమలిని ప్రేమిస్తున్న చరణ్‌ రామాపురానికి చెందిన విజయ్‌ సేతుపతిలా ఉండటంతో సంజయ్‌ ఆశ్చర్యపోతాడు. దీంతో ఊరి ప్రజలను దారి తెచ్చుకునేందుకు అచ్చం విజయ్‌లా ఉన్న చరణ్‌ ద్వారా తన ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని అనుకుంటాడు. దానికోసం చరణ్‌ను అక్కడకు పంపిస్తాడు. ఆ ఊరు వెళ్లిన చరణ్‌ విజయ్ సేతుపతిలా నటించి అక్కడి ప్రజలను మోసం చేశాడా..? అసలు ఆ ఊరిలోని విజయ్‌ సేతుపతి ఏమయ్యాడు..? అతడెవరు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోండి

విశ్లేషణ: విజయ్ సేతుపతి నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆయన ఎంత గొప్ప నటుడో, పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రను ఎంతలా పండిస్తాడో వివరించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినమాలో విజయ్ నటనకు అంత స్కోప్ కనిపించలేదు. ముఖ్యంగా కథలో పట్టు లేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. 'సంఘతమిజన్‌' ఔట్ అండ్‌ ఔట్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ చిత్రం కావడం, ఇలాంటి కథలు ఇప్పటికే అనేకం రావడంతో ఈ సినిమా కూడా వాటిలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే తెలిసిన కథే అయినప్పటికీ దర్శకుడు తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించగలగాలి. అందులో విజయ్‌ చందర్‌ పర్వాలేదనిపించాడు. ఇక సినిమాలో సస్పెన్స్ ఎక్కడా కనిపించదు. కానీ సరదాగా గడిచిపోతుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సినిమా అవకాశాల కోసం చరణ్‌, సూరి తిరగడం, మధ్యలో చరణ్‌-కమలిని లవ్ ట్రాక్.. వీటిలో కొత్తదనం ఏమీ ఉండదు. సెకండ్ హాఫ్‌లో కథకు కొంత  వెయిట్ వచ్చినా.. అది ప్రేక్షకుడికి మెప్పించలేదు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూసినట్లుగానే విలన్‌ డబ్బుతోనే ప్రజలకు సౌకర్యాలు కల్పించి.. ఫైనల్‌గా తాను ప్రజల మనిషినే అంటూ విలన్‌ను దెబ్బతీసే ఫార్ములా ఇది. దీంతో సినిమాలో కొత్తదనం లేకుండా పోయింది. ఇక విలన్ పాత్రను బలంగా తీర్చిదిద్దడంలో కూడా డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

సాధారణంగానే నటనకు పెద్ద స్కోప్ లేని మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ కావడంతో విజయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక కథానాయికలు రాశీఖన్నా, నివేదా పేతురాజ్‌లకు అంత విలువైన క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు. విలన్‌లు రవి కిషన్‌, అశుతోష్‌ రాణాల పాత్రల్లో వెయిటేజ్ లేదు. నాజర్ తన పాత్రకు న్యాయం చేశాడు. సూరి మంచి కామెడీ పండించాడు.


కంక్లూజన్: పాత కథకు కొత్త తాలింపు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: రంజాన్ వేళ తీవ్ర విషాదం..!!

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>