MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala628eb440-fb62-472d-9f0b-259a349ede97-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala628eb440-fb62-472d-9f0b-259a349ede97-415x250-IndiaHerald.jpgబాలక్రిష్ణది దాదాపుగా అయిదు పదుల సినీ జీవితం. ఆయన 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా ఇప్పటి దాకా నటిస్తూనే ఉన్నారు. బాలయ్య నాటి నుంచి నేటి వరకూ ఎందరో దిగ్దర్శకులతో కలసి పనిచేశార్. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. bala;balakrishna;jeevitha rajaseskhar;tara;cinema;rayalaseema;producer;producer1;heroine;posters;murari;jandhyala ravishankarబాలయ్య జంధ్యాల మూవీ ఎందుకు ఆగింది... ?బాలయ్య జంధ్యాల మూవీ ఎందుకు ఆగింది... ?bala;balakrishna;jeevitha rajaseskhar;tara;cinema;rayalaseema;producer;producer1;heroine;posters;murari;jandhyala ravishankarFri, 14 May 2021 20:00:00 GMTబాలక్రిష్ణది దాదాపుగా అయిదు పదుల సినీ జీవితం. ఆయన 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా ఇప్పటి దాకా నటిస్తూనే ఉన్నారు. బాలయ్య నాటి నుంచి నేటి వరకూ ఎందరో దిగ్దర్శకులతో కలసి పనిచేశార్. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే బాలయ్య జంధ్యాల కాంబోలో ఫస్ట్ మూవీగా 1984లో బాబాయ్ అబ్బాయ్  వచ్చింది. ఇది మంచి విజయాన్నే నమోదు చేసింది. ఆ తరువాత  యువచిత్ర బేనర్ మీద ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి నిర్మాణాన వచ్చిన  సీతారామ కళ్యాణం మూవీ కూడా వీరిద్దరి కాంబోలోదే.  ఇది సూపర్ హిట్ అయింది. ఇక ముచ్చటగా మూడవ సినిమా ఈ ఇద్దరి కలయికలో అప్పట్లో చిత్ర నిర్మాతలు  ప్లాన్ చేశారు.

దాని పేరు నటరత్న అని కూడా పెట్టారు. ఈ మూవీ మొత్తం విదేశాలలో  తీయడానికి కూడా స్క్రిప్ట్ ని రెడీ చేశారు. ఈ మూవీలో బాలయ్య పక్కన ఖుష్బూ హీరోయిన్ గా నటిస్తుందని కూడా ప్రకటనలు వచ్చాయి. దానికి సంబంధించి అప్పట్లో మీడియాలో కూడా పోస్టర్ వేశారు. అన్నీ అనుకున్నాక మాత్రం ఈ మూవీ ఎందుకో ఆగిపోయింది. ఆ తరువాత కూడా ఈ మూవీ గురించి ఎటువంటి ప్రస్థావన లేకుండా పోయింది.

అయితే ఈ మూవీ కధతోనే రమేష్ బాబు ఖుష్బూ హీరోహీరోయిన్లుగా చిన్ని క్రిష్ణుడు మూవీని తీశారని చెబుతారు. చిన్ని క్రిష్ణుడు ఫ్లాప్ అయినా అందులో పాటలు సూపర్ డూపర్ హిట్. మొత్తానికి నటరత్నగా బాలయ్య నటించాల్సిన మూవీ మాత్రం ఆగింది. అదే కనుక చేసి ఉంటే బాలయ్య ఖాతాలో మరో హిట్ ఉండేది అని అభిమానులు అంటారు. కొన్ని సార్లు కొంత షూటింగ్ జరిగి కూడా ఆగిపోయిన సినిమాలూ ఉంటాయి. మొత్తానికి విచిత్ర సీమ అయిన చిత్ర సీమలో ఇలాంటి చిత్రాలు చాలానే జరుగుతూ ఉంటాయి.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈసారి గ్యాప్ వచ్చిన గ్యారేంటి హిట్ ఖాయమట..

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>