PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungusc53d4959-ba91-40f0-8dce-11324c682c85-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungusc53d4959-ba91-40f0-8dce-11324c682c85-415x250-IndiaHerald.jpg దేశ ప్రజలు ఇప్పటికే కరోనాతో భయాందోళనలకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో దేశంలో బ్లాక్ ఫంగస్ విజృంభణ మొదలయింది. దీంతో ప్రజల్లోని భయం మరింత పెరిగింది. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్న వారిలో బయటపడుతోంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, అంతేకాకుండా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని..black fungus;delhi;central government;pune;panjaaపూణేపై బ్లాక్ ఫంగస్ పంజా.. ఎన్ని కేసులంటే..పూణేపై బ్లాక్ ఫంగస్ పంజా.. ఎన్ని కేసులంటే..black fungus;delhi;central government;pune;panjaaFri, 14 May 2021 19:05:00 GMTపూణే: దేశ ప్రజలు ఇప్పటికే కరోనాతో భయాందోళనలకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో దేశంలో బ్లాక్ ఫంగస్ విజృంభణ మొదలయింది. దీంతో ప్రజల్లోని భయం మరింత పెరిగింది. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్న వారిలో బయటపడుతోంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, అంతేకాకుండా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు అనేకం నమోదయ్యాయి. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు వైద్యులకు మార్గదర్శకాలను జారీ చేశారు.

ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్‌లలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది ఈ ఫంగస్ బారిన పడ్డారని ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ ఫంగస్ బారిన పడిన రోగులు తమ కంటి చూపును కోల్పోతున్నారు. ఈ ఫంగస్‌కు చికిత్స చేస్తే నయమవుతుందని, నిర్లక్ష్యం చేస్తే రోగి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని, ఇంకా ఆలస్యం అయితే ప్రాణాలు కూడా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా ఈ జాబితాలో పూణే కూడా చేరింది. ఇప్పటికే పూణేలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

పూణేలో ఇప్పటి వరకు 270 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారు పాటించవలసిన నిబంధనలను జారీ చేసింది. ఈ బ్లాక్ ఫంగస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఎవరికైనా తలనొప్పి, జ్వరం, కళ్ళ కింద నొప్పి, ముక్కు దిబ్బడ, కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. ఈ ఫంగస్ ఎక్కువగా సైనస్, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. మరి ఈ విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈసారి గ్యాప్ వచ్చిన గ్యారేంటి హిట్ ఖాయమట..

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>