MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/tollywoodf4ff900a-361f-4536-ae50-0872aaa0dfc8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/tollywoodf4ff900a-361f-4536-ae50-0872aaa0dfc8-415x250-IndiaHerald.jpgక‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వ‌ర‌కూ దాదాపు ఎన్నో సినిమాలు విడుద‌ల‌ వాయిదా వేసుకున్నాయి. అయితే ప్రేక్ష‌కుల్లో క్రేజ్ సంప‌దాదించుకుని క‌రోనా ఎఫెక్ట్ తో వాయిదా ప‌డ్డ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ హీరోగా న‌టించిన ఆచార్య సినిమాను ముందుగా మే 13న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ క‌రోనా విజృంభ‌న‌తో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నారు. ఇక ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాక కొత్త డేట్ ను ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు.tollywood;chiranjeevi;nani;rana;shiva;siva nirvana;srikanth;srikanth addala;telangana;cinema;remake;lord siva;heroine;shiva nirvanaక‌రోనా దెబ్బ‌కు వాయిదా ప‌డ్డ 5 సినిమాలు.. !క‌రోనా దెబ్బ‌కు వాయిదా ప‌డ్డ 5 సినిమాలు.. !tollywood;chiranjeevi;nani;rana;shiva;siva nirvana;srikanth;srikanth addala;telangana;cinema;remake;lord siva;heroine;shiva nirvanaFri, 14 May 2021 21:13:15 GMTక‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వ‌ర‌కూ దాదాపు ఎన్నో సినిమాలు విడుద‌ల‌ వాయిదా వేసుకున్నాయి. అయితే ప్రేక్ష‌కుల్లో క్రేజ్ సంప‌దాదించుకుని క‌రోనా ఎఫెక్ట్ తో వాయిదా ప‌డ్డ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ హీరోగా న‌టించిన ఆచార్య సినిమాను ముందుగా మే 13న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ క‌రోనా విజృంభ‌న‌తో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నారు. ఇక ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాక కొత్త డేట్ ను ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు.


నాగ‌చైతన్య శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా ల‌వ్ స్టోరీ. ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు సారంగ‌ద‌రియా పాట సినిపై ఎన్నో అంచ‌నాల‌ను పెంచాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతగానో ఎదురు చూసారు. ఎప్రిల్ 16న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా దెబ్బతో వాయిదా ప‌డింది. దాంతో ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రాగానే మ‌రో విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

రానా సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన విరాట ప‌ర్వం సినిమా టీజ‌ర్ మ‌రియు పాటలు సినిమాకు క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. దాంతో ఈ సినిమా విడుద‌ల కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూసారు. ఈ చిత్రాన్ని ఎప్రిల్ 30న విడుద‌ల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ క‌రోనా సెంకండ్ వేవ్ తో ఈ సినిమా విడుద‌ల కూడా వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా నార‌ప్ప‌. త‌మిళ అసుర‌న్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని మే 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర చూనిట్ ప్ర‌క‌టించినా ప‌రిస్థితులు అనుకూలంగా లేక‌పోవ‌డంతో విడుద‌ల వాయిదా వేసుకున్నారు.



నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం ట‌క్ జ‌గ‌దీశ్. ఈ సినిమాలో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను ఎప్రిల్ 23న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే క‌రోనా విజృంభ‌న‌తో విడుద‌ల తేదీని వాయిదా వేసుకుంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?

ర‌ఘురామ అరెస్టులో హైడ్రామా... ఎక్క‌డ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>