SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/meeru-saibaba-bhakthula-ivi-thelusukondi45e803aa-8e99-4d97-a1f0-0b9e14d44b8d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/meeru-saibaba-bhakthula-ivi-thelusukondi45e803aa-8e99-4d97-a1f0-0b9e14d44b8d-415x250-IndiaHerald.jpgసాయి బాబా భక్తులు నిత్యం పూజ చేయడం వేరు. గురువారం నాడు బాబాకి పూజ చేసే విధానం వేరు. ఎంతో మంది హిందువులు షిరిడి సాయిని తమ ఇలవేల్పుగా, ప్రధాన దైవంగా కొలుస్తుంటారు. అలాంటి వారు గురువారం నాడు పూజా విధానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.LORD SAI DETAILS;pooja hegde;nithya new;bari;baba bhaskar;hindus;shatru1మీరు సాయిబాబా భక్తులా ? ఇవి తెలుసుకోండి ?మీరు సాయిబాబా భక్తులా ? ఇవి తెలుసుకోండి ?LORD SAI DETAILS;pooja hegde;nithya new;bari;baba bhaskar;hindus;shatru1Fri, 14 May 2021 06:00:00 GMTసాయి బాబా భక్తులు నిత్యం పూజ చేయడం వేరు. గురువారం నాడు బాబాకి పూజ చేసే విధానం వేరు. ఎంతో మంది హిందువులు షిరిడి సాయిని తమ ఇలవేల్పుగా, ప్రధాన దైవంగా కొలుస్తుంటారు. అలాంటి వారు గురువారం నాడు పూజా విధానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గురువారం బాబాకి ఎంతో ప్రీతికరమైన రోజని తెలిసిన విషయమే. కాబట్టి ఈ రోజున బాబాకి చేసే పూజ పుణ్య ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మికులు చెబుతున్నారు. బాబాకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే ఆ సాయినాధుని అనుగ్రహం తప్పక పొందుతారని, సంకల్ప సిద్ధి చేకూరుతుందని తెలుపుతున్నారు. మీ కోరికలు నెరవేరాలి అన్నా, ఋణ బాధలు తొలగిపోవాలి అన్నా, శత్రువుల బారి నుండి తప్పించుకోవాలి అన్నా, గురువారం నాడు బాబాకి నైవేద్యంగా హల్వా, పాలకూరను సమర్పించుకోవాలి.

గురువారం నాడు సాయిబాబా కు పండ్లు, పుష్పాలతో పాటు, కిచిడిని కానీ, హల్వాని కానీ నైవేద్యంగా సమర్పించినట్లు అయితే  అద్భుత ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా చేస్తే మీరు ఋణ బాధల నుండి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా మల్లెపూల మాలను కానీ, తులసిమాలను కానీ బాబా మెడలో వేయడం శ్రేష్టం. గురువారం నాడు చేసే దాన ధర్మాలు మనకు సిరిసంపదలు తెచ్చిపెడతాయి. గురువారం నాడు చేసే అన్నదానం మన పాపాలను తొలగిస్తుంది.

ఇవి ఏమీ ఇవ్వలేని, చేయలేని స్థితిలో మీరు ఉన్నా కూడా, పిడికెడు చక్కెర పెట్టి ఆ బాబాను భక్తి శ్రద్ధలతో వేడుకున్నా బాబా ఆశీర్వాదం మీకు తప్పక దొరుకుతుంది. ఆయన చల్లని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. నమ్మి కొలిచే భక్తులకు ఎప్పుడూ నీడల్లే తోడు ఉంటాడు ఆ శిరిడి సాయి. "ఓం సాయి ... శ్రీ సాయి ... జయ జయ సాయి " అనే మంత్రాన్ని కూడా ఆయన ముందు పఠించడం చాలా అవసరం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"వేదాలం " ను పక్కన పెట్టిన మెగాస్టార్ ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>