Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/khiladi535c0336-f457-4787-8b85-29fecb03a1ab-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/khiladi535c0336-f457-4787-8b85-29fecb03a1ab-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ దెబ్బకు సినిమాలన్నీ ఓటీటీల బాటపడుతున్న విషయం తెలిసిందే. గతేడాది కూడా ఇలానే థియేటర్లు లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అయితే తిరిగి డిసెంబర్‌లో థియేటర్లు తెరుచుకున్న తరువాత మళ్లీ నెమ్మదిగా సినిమాలు పెద్ద తెరపైకొచ్చాయి. అలా వచ్చిన సినిమాల్లో రవితేజ క్రాక్ సినిమా తొలి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో వెంటనే తన రెండో ప్రాజెక్టును కూడా మొదలు పెట్టేశాడు మాస్ మహారాజ. అంతేకాదు వేగంగా ఆ సినిమాను..khiladi;ravi;meenakshi;ram gopal varma;arjun sarja;geetha;ravi teja;unni mukundan;cinema;sangeetha;amazon;arjun 1;mass;krack;chitramఓటీటీలో ఖిలాడి..? ఎందులో అంటే..!ఓటీటీలో ఖిలాడి..? ఎందులో అంటే..!khiladi;ravi;meenakshi;ram gopal varma;arjun sarja;geetha;ravi teja;unni mukundan;cinema;sangeetha;amazon;arjun 1;mass;krack;chitramFri, 14 May 2021 15:21:00 GMTరవితేజ క్రాక్ సినిమా తొలి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో వెంటనే తన రెండో ప్రాజెక్టును కూడా మొదలు పెట్టేశాడు మాస్ మహారాజ. అంతేకాదు వేగంగా ఆ సినిమాను తెరపైకి తెచ్చేందుకు కూడా రెడీ అయిపోయాడు. కానీ తాజాగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడంతో థియేటర్లు ఈ ఏడాది కూడా మూత పడ్డాయి. దీంతో అనేక సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే ఈ సారి రవితేజ కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నాడు.


మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఖిలాడి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు రాక్షసుడు ఫైం రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సత్యనారాయణ కోనేరుతో కలిసి రమేశ్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. క్రాక్ తరువాత రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై కూడా అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. అంతేకాకుండా చిత్ర ఫస్ట్ లుక్ కూడా అంచనాలను పెంచింది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ నెలలో అంటే మేలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ కరోనా సెకండ్ దెబ్బకు సినిమాలన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఓటీటీలో ఈ సినిమా విడుదల కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఖిలాడి చిత్ర స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి చూడాలి రవితేజ కూడా ఓటీటీ బాట పడతాడా లేదా..? అని. అయితే ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక  పాత్రల్లో కనిపింబోతున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫీవ‌ర్ స‌ర్వేలో వెలుగు చూస్తున్న సంచ‌ల‌న విష‌యాలు ఇవే..?

రంజాన్ పండుగ గురించి తెలియని మరికొన్ని విషయాలు..

నాగార్జున పరిచయం చేసిన దర్శకులు..లిస్ట్ లో ప్రముఖులు

స్పుత్నిక్ పంపిణీ షురూ.. ధర ఎంతంటే ?

కన్నపేగుకు కరోనా శోకం..ఐదు నెలల చిన్నారి మృతి..!!

అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ : గవాస్కర్

మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>