PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus06f1e77a-71e9-48e8-b6d9-5a647d75b571-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus06f1e77a-71e9-48e8-b6d9-5a647d75b571-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ తొలి వేవ్ కంటే, సెకండ్ వేవ్ ప్రజలపై మరింత ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారు ఎక్కువగా మరణిస్తుండడం మనలో భయాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సాధారణంగా 25 నుండి 30 వయసు మధ్య ఉండే వారు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటారు.CORONAVIRUS;drugs;coronavirusకరోనా నుండి కోలుకున్నారా ? ఈ టెస్ట్ చేసుకోండి ?కరోనా నుండి కోలుకున్నారా ? ఈ టెస్ట్ చేసుకోండి ?CORONAVIRUS;drugs;coronavirusFri, 14 May 2021 13:00:00 GMTకరోనా వైరస్ తొలి వేవ్ కంటే, సెకండ్ వేవ్ ప్రజలపై మరింత ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వారు ఎక్కువగా మరణిస్తుండడం మనలో భయాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సాధారణంగా 25 నుండి 30 సంవత్సరాల వయసు ఉండే వారు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటారు. అలాంటి వారు కూడా ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా నుండి కోలుకుని నెగటివ్ రావడంతో ఎలాగోలా తప్పించుకున్నాము అనుకునే లోపు కొందరు హఠాత్తుగా కుప్పకూలి ఊపిరి వదిలేస్తున్నారు.

కరోనా వైరస్ శరీరంలోని ఊపిరితిత్తుల పైన మాత్రమే కాదు, శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రక్తనాళాలపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతుందని ఇటీవలే డాక్టర్లు గుర్తించారు. కొందరిలో రక్తం గడ్డ కట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే చికిత్స చేయవచ్చుగాని, ఆలస్యమైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం తీస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి కరోనా నుండి కోలుకున్న తర్వాత డి- డైమర్ అనే పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

ఈ టెస్ట్ ద్వారా మన శరీరంలోని రక్తనాళాల్లో ఏమైనా సమస్య కనుక ఉన్నట్లయితే గుర్తించడం సాధ్యమవుతుంది అంటున్నారు. తద్వారా అందుకు అనుగుణంగా డ్రగ్స్, ఇంజక్షన్ లను ఇచ్చి నయం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మెదడులో కానీ, గుండెలో కానీ ఎక్కడైనా రక్తం గడ్డ కట్టి ఉంటే ఈ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. తర్వాత వెంటనే వైద్యులు అందుకు తగ్గ చికిత్సను అందిస్తారు. గడ్డ కట్టిన రక్తాన్ని పలుచబడేలాగా  చేసి బ్లడ్ క్లాటింగ్ ను నియంత్రించడం జరుగుతుంది.  కావున కరోనా నుండి కోలుకున్న తర్వాత డి- డైమర్ టెస్ట్ చాలా కీలకం అని చెబుతున్నారు వైద్యులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్షయ తృతీయ: వందేళ్ల క్రితం పుత్తడి ప్రస్థానం ఇదే..!

Sputnik-V ధరను ప్రకటించిన రెడ్డీస్..!!

కేజీఎఫ్, పుష్ప.. ఆ విషయంలో జిరాక్స్ కాపీలే..

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>