ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/corona-virus-next-level-danger-goverment-7260ddfc-c9b0-4f4d-b473-981a0612f558-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/corona-virus-next-level-danger-goverment-7260ddfc-c9b0-4f4d-b473-981a0612f558-415x250-IndiaHerald.jpgఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభనికి దారితీసింది. ఈ విపత్తు నుండి ఎప్పుడు బయటపడతామో కూడా తెలియని పరిస్థితి ఉండగా.. కేంద్రం మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. మరోసారి కోవిడ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నీతి అయోగ్ సభ్యుడు వి కె పాల్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. అంతే కాకుండా కఠిన ఆంక్షలు విధించి, ప్రజలందరూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. రెండోదశ వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం అంచనా వేయలేదనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు."రెండవ CORONA VIRUS NEXT LEVEL DANGER GOVERMENT;modi;prime minister;minister;doctor;central government;march;v;coronavirusకరోనా వైరస్ ఎక్కడికీ పోదు అంటున్న కేంద్రం !కరోనా వైరస్ ఎక్కడికీ పోదు అంటున్న కేంద్రం !CORONA VIRUS NEXT LEVEL DANGER GOVERMENT;modi;prime minister;minister;doctor;central government;march;v;coronavirusFri, 14 May 2021 19:00:00 GMT
ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభనికి దారితీసింది. ఈ విపత్తు నుండి ఎప్పుడు బయటపడతామో కూడా  తెలియని పరిస్థితి ఉండగా.. కేంద్రం మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. మరోసారి కోవిడ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నీతి అయోగ్ సభ్యుడు వి కె పాల్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. అంతే కాకుండా కఠిన ఆంక్షలు విధించి, ప్రజలందరూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.

రెండోదశ వైరస్  వ్యాప్తిని ప్రభుత్వం అంచనా వేయలేదనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు."రెండవ దశ విజృంభన ఉంటుందని పదే పదే హెచ్చరించాం. సీరో పాజిటివిటీ  రేటు 20 శాతంగా ఉంది. కాబట్టి మిగిలిన 80  శాతం మందికి ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేశాము.. వైరస్ అంత త్వరగా అంతమవదు. అది  ఎక్కడికి పోలేదని, ఇతర దేశాల్లో కూడా పలు రకాల వేవ్ లను చూస్తున్నాయని చెప్పాం.. అయితే చివరికి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు"అని వికే పాల్ గుర్తుచేశారు.

అందరం కలిసికట్టుగా పోరాడుదామని, మార్చి 17న ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయాన్ని వికే పాల్ గుర్తుచేశారు. అంతేకాకుండా రెండవ దశలో కేసులు ఈ స్థాయిలో వస్తాయని తెలుసని, అలాగే వైరస్ మళ్లీ విజృంభిస్తుంది అని కూడా తెలుసు అని ఆయన వివరించారు. ఎవరిని భయపెట్టాలనే ఉద్దేశంతో ఇలా హెచ్చరించలేదని, పలు దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి, కొవిడ్ నిబంధనలను పాటించి, వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు.


కరోనా సెకండ్ దశలో డబుల్ మ్యూటెంట్  B.1.617 వేరియంట్ కారణమని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. అంతేకాకుండా ఇందులోనే B.1.617.1,B1.617.2 ఇంకా వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ అని ,ఇది ప్రాణాంతకమైన వైరస్ అని కేంద్ర ఆరోగ్య మంత్రి  , డాక్టర్ హర్షవర్ధన్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, మొత్తం 12 రాష్ట్రాల్లో యాక్టిివ్ కేసులు ఉన్నాయని , ఇరవై నాలుగు రాష్ట్రాల్లో పాజిటివిటీ  రేటు 15 శాతం ఉందన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య రెండవ వైపు చూస్తే... ?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>