Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajakeeyam-jagan-thona-prajala-thonab7204b1b-bdc2-427f-a2f3-e21aa711c854-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajakeeyam-jagan-thona-prajala-thonab7204b1b-bdc2-427f-a2f3-e21aa711c854-415x250-IndiaHerald.jpgప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌.. టీడీపీ అధినేత‌.. చంద్ర‌బాబు విష‌యంలో ఆయ‌న‌ను అభిమానించేవారు సైతం.. ఇ ప్పుడు విస్తుపోతున్నారు. చంద్ర‌బాబుకు అన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఒక విధ‌మైన రాజ‌కీయాల‌కు తెరదీశా రంటూ.. ఫోన్ల‌లోనే మండిప‌డుతున్నారు. టీడీపీకి, చంద్ర‌బాబుకు ఎంత అభిమానులు ఉన్న‌ప్ప‌టికీ.. కొంద రు మాత్రం త‌ట‌స్థ రాజ‌కీయాలు కోరుకుంటారు. అంటే.. ఉన్న విష‌యంలోనిజ‌మైన విమ‌ర్శ ఉంటే.. చేయా లి త‌ప్ప‌. ఉత్తినే పోసుకోలు విమ‌ర్శలు చేయ‌డాన్ని మాత్రం వారు స‌హించ‌లేరు. ఇప్పుడు ఇలాంటి వారే చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధCbn;kcr;tdp;central governmentరాజ‌కీయం జ‌గ‌న్‌తోనా.. ప్ర‌జ‌ల‌తోనా.. బాబూ!!రాజ‌కీయం జ‌గ‌న్‌తోనా.. ప్ర‌జ‌ల‌తోనా.. బాబూ!!Cbn;kcr;tdp;central governmentFri, 14 May 2021 09:00:00 GMTప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌.. టీడీపీ అధినేత‌.. చంద్ర‌బాబు విష‌యంలో ఆయ‌న‌ను అభిమానించేవారు సైతం.. ఇ ప్పుడు విస్తుపోతున్నారు. చంద్ర‌బాబుకు అన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఒక విధ‌మైన రాజ‌కీయాల‌కు తెరదీశా రంటూ.. ఫోన్ల‌లోనే మండిప‌డుతున్నారు. టీడీపీకి, చంద్ర‌బాబుకు ఎంత అభిమానులు ఉన్న‌ప్ప‌టికీ.. కొంద రు మాత్రం త‌ట‌స్థ రాజ‌కీయాలు కోరుకుంటారు. అంటే.. ఉన్న విష‌యంలోనిజ‌మైన విమ‌ర్శ ఉంటే.. చేయా లి త‌ప్ప‌. ఉత్తినే పోసుకోలు విమ‌ర్శలు చేయ‌డాన్ని మాత్రం వారు స‌హించ‌లేరు.

ఇప్పుడు ఇలాంటి వారే చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు అంశాల ప్రాతిప‌దిక‌గా.. చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌లు ల‌భించ‌క‌పోవ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భు త్వ‌మే రీజ‌న్ అంటున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎందుకు పెట్ట‌డం లేద‌ని నిల‌దీశారు. అంతేకాదు.. పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ పెట్టింద‌ని.. ఆ మాత్రం జ‌గ‌న్‌కు తెలియ‌దా? అంటూ.. ప్ర‌శ్నించారు. అయితే.. ఈ రెండు విష‌యాల్లోనూ.. చంద్ర‌బాబు పార‌ద‌ర్శ‌కంగా ఆలోచించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు కొంద‌రు.

మ‌రికొంద‌రు.. ఉద్దేశ పూర్వ‌కంగానే చంద్ర‌బాబు ఇలా దుమ్మెత్తి పోస్తున్నారు త‌ప్ప‌.. ఆయ‌న‌కు అన్నీ తెలు సున‌ని చెబుతున్నారు. లాక్‌డౌన్ పెడితే.. రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని.. తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాలు సైతం.. అక్క‌డి కేసీఆర్ స‌ర్కారుకు ప్ర‌తిపాదిస్తున్నాయి. ఇక‌, వ్యాక్సిన్ విష‌యంలోనూ అక్క‌డ ఎవ‌రూ రాజ‌కీయాలు చేయ‌డం లేదు. కేవ‌లం ప్రైవేటు ఆసుప‌త్రుల దోపిడీకి మాత్ర‌మే అడ్డుక‌ట్ట వేయాల‌ని చెబు తున్నారు. కానీ, ఏపీలో మాత్రం వ్యాక్సిన్ త‌యారీ.. స‌హా ఎవ‌రి ఆధిప‌త్యంలో వ్యాక్సిన్ ఉంటుంది? అనే విష‌యాలు ప‌రిపూర్ణంగా తెలిసి  కూడా.. ఆయ‌న ఇప్పుడు చేస్తున్న రాజ‌కీయాలు స‌మంజ‌సం కాద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం కేంద్రం ఆధ్వ‌ర్యంలోనే వ్యాక్సిన్ ఉంద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు వ్యాక్సిన్ పంపిణీ ఉంద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇక‌, లాక్డౌన్ పెట్ట‌క‌పోయినా.. ఉద‌యం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 వ‌ర‌కు జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా క‌ర్ఫ్యూ పెట్టిన విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి విష‌యాల్లో రాజ‌కీయాలే కాకుండా.. ప్ర‌జా కోణాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాల‌ని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: జపాన్‌లో భారీ భూకంపం..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?

కరోనాను ఢీ-కొట్టే సాంప్రదాయ అమృత ఆహారం - తరవాణి

ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌కు భూక‌బ్జా కార‌ణం కాదా..? అస‌లు కార‌ణం వేరేనా!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>