MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa8fa90a93-0f22-49dc-8614-0dc3c1348b72-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa8fa90a93-0f22-49dc-8614-0dc3c1348b72-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇపుడు కొత్త దారులు వెతుకుతోంది. సంక్షోభాలను కూడా అనుకూలంగా మార్చుకుంటూ విజయాలకు బాటలు వేసుకుంటోంది. కరోనా మహమ్మారి వేళ భారీ సినిమాల బిజినెస్ కి గట్టి షాక్ తగులుతోంది. దాంతో ఫిల్మ్ మేకర్స్ నూతన మార్గాలను అన్వేషిస్తున్నారు. pushpa;business;balakrishna;allu arjun;india;tollywood;cinema;bahubali;blockbuster hit;arjun 1;father;mahaరెండు ముక్కలతో లెక్క సెట్ అవుతుందా... ?రెండు ముక్కలతో లెక్క సెట్ అవుతుందా... ?pushpa;business;balakrishna;allu arjun;india;tollywood;cinema;bahubali;blockbuster hit;arjun 1;father;mahaFri, 14 May 2021 19:00:00 GMTటాలీవుడ్ ఇపుడు కొత్త దారులు వెతుకుతోంది. సంక్షోభాలను కూడా అనుకూలంగా మార్చుకుంటూ విజయాలకు బాటలు వేసుకుంటోంది. కరోనా మహమ్మారి వేళ భారీ సినిమాల బిజినెస్ కి గట్టి షాక్ తగులుతోంది. దాంతో ఫిల్మ్ మేకర్స్ నూతన మార్గాలను అన్వేషిస్తున్నారు.

అందులో నుంచి పుట్టిందే ఒక సినిమా రెండు పార్టులు అన్నది. నిజానికి ఇది అయిదేళ్ల క్రితం నాటిదే,  చాలా పాతదే.  దీన్ని ఫస్ట్ అనుసరించింది బాహుబలి మేకర్స్. బాహుబలి మూవీని  మొదటి ఒకటే అనుకున్నారు. కానీ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం, సినిమా నిడివి కూడా పెంచాల్సిరావడంతో బడ్జెట్ కూడా చేయి దాటుతూండడంతో అన్నీ దృష్టిలో ఉంచుకుని రెండు భాగాలుగా విడగొట్టారు. దాంతో సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ అన్నట్లుగా చరిత్రలో నిలిచి వేల కోట్ల కలెక్షన్లను తెచ్చిపెట్టింది.

ఆ తరువాత బాలయ్య తన తండ్రి బయోపిక్ ని కధానాయకుడు, మహా నాయకుడు పేరిట రెండు భాగాలుగా తీశారు అయితే అవి ఆడలేదు. ఇపుడు పుష్ప సినిమా మేకర్లు రెండు పార్టులు అంటున్నారు. అలా వారు అనడానికి కారణం ఏంటి అంటే బడ్జెట్ పెరిగిపోవడమే అని సమాధానం వస్తోంది. పుష్ప సినిమా బిజినెస్ 120 కోట్ల దగ్గర ఆగితే బడ్జెట్ చూస్తే 250 కోట్లకు ఎగబాకేలా ఉందిట.  ఇక అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠ పురంలో మూవీ కలెక్షన్లు 150 కోట్లుగా చెబుతున్నారు. అంటే రెండు గా కాకుండా సినిమా ఒక్కటిగా రిలీజ్ చేస్తే భారీ నష్టాలు వస్తాయని అంచనా వేసుకునే అలా ముక్కలు చేస్తున్నారు అంటున్నారు.

ఇలా రెండు భాగాలు చేయడం వల్ల బడ్జెట్ కష్టాలను నష్టాలను అధిగమించవచ్చు అని లెక్కలు వేసుకుంటున్నారుట. కరోనా వల్ల అనుకోని బడ్జెట్ కూడా మీద పడడం వంటి కారణాలే ఇలా పుష్పను ముక్కలు చేశాయని అంటున్నారు. ఇపుడు ఇది కనుక వర్కౌట్ అయితే మిగిలిన పాన్ ఇండియా మూవీస్ కూడా రెండు భాగాలుగానే వస్తాయేమో చూడాలి. మొత్తానికి రెండు ముక్కలతోనే లెక్క సెట్ అవుతుంది అంటున్నారుట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య రెండవ వైపు చూస్తే... ?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>