PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona52aa0d5b-f30b-4584-bbf6-7e9deef966ec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona52aa0d5b-f30b-4584-bbf6-7e9deef966ec-415x250-IndiaHerald.jpgఈ కరోనా కాలంలో దేశ పరిస్థితుల గురించి, ప్రజల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకవైపు కరోనా మహమ్మారి కబళిస్తుంటే దానిని ఎదుర్కొనేందుకు కావలసిన ఆక్సిజన్, వ్యాక్సిన్‌ల కొరత దేశంలో నెలకొంది. అంతేకాకుండా రోగులకు కావలసిన పడకలు కూడా ఆసుపత్రుల్లో కరువయ్యాయి. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ డోసులు అయిపోయి. మరికొన్ని టీకా డోసుల కోసం రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో కేవలం రెండు సంస్థలు మాత్రమే..corona;india;government;central government;oxygenఆగస్టు నాటికి 200 కోట్ల టీకాలు..?ఆగస్టు నాటికి 200 కోట్ల టీకాలు..?corona;india;government;central government;oxygenFri, 14 May 2021 12:02:23 GMTఆక్సిజన్, వ్యాక్సిన్‌ల కొరత దేశంలో నెలకొంది. అంతేకాకుండా రోగులకు కావలసిన పడకలు కూడా ఆసుపత్రుల్లో కరువయ్యాయి. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ డోసులు అయిపోయి. మరికొన్ని టీకా డోసుల కోసం రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో కేవలం రెండు సంస్థలు మాత్రమే ఈ టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అవి నెలకు కేవలం 6 నుంచి 7 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. దాంతో టీకాల కొరత రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కంపెనీలపై ఫిర్యాదులు చేశాయి.

అయితే తాజాగా  ఈ టీకా సంస్థలు తమ టీకా ఉత్పత్తి సామర్థ్యం గురించి మాట్లాడాయి. రానున్న నాలుగు నెలల్లో తమ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నామని వారు చెప్పారు. దేశంలోని టీకాల కొరతను అరికట్టేందుకు తమ ఉత్పత్తిని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. ఆగస్టు నాటికి భారత్ బయోటెక్ 7.8 కోట్లకు పెంచుతామని చెప్పింది. అదే విధంగా సీరమ్ సంస్థ తమ ఉత్పత్తిని 10 కోట్లకు పెంచుతామని ప్రకటించారు. ఇదే స్థాయిలో తమ ఉత్పత్తిని సెప్టెంబరు‌లోనూ పెంచుతామని తెలిపారు.


ఇదిలా ఉంటే భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలతో పాటు మరికొన్ని విదేశీ టీకా సంస్థలు కూడా భారత్‌లోకి రానున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రా జనికా సంస్థలు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అవి తమ దేశాల్లో ప్రభుత్వాలకు రూ.12 వందలకు, ప్రజలకు రూ.18 వందలకు వ్యాక్సిన్ అందిస్తున్నాయి. ఇక భారత్ విషయానికొస్తే వ్యాక్సిన్‌ను రూ.2200కు ఇవ్వగలమని చెప్పుకొచ్చాయి. కానీ భారత ధరల ప్రకారం వ్యాక్సిన్ ధర తగ్గించమన్న విధంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే ఆగస్టు నాటికి భారత్‌లో అనేక వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయి. అనుకున్నట్లు జరిగితే ఆగస్టునాటికి దాదాపు 200 కోట్ల టీకాలు భారత్‌కు వస్తాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ పై మోడీని బిజెపి సిఎం లు కూడా నమ్మట్లేదా...?

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>