PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganc3894863-e55e-41f6-a247-242b66f1c480-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganc3894863-e55e-41f6-a247-242b66f1c480-415x250-IndiaHerald.jpgప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఏపీ సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో ప్రజలకు పథకాలు అందిస్తూనే ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, తాను ఇచ్చిన హామీలని వరుసపెట్టి అమలు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో దాదాపు అన్నీ హామీలని అమలు చేశారు. అయితే ముందు చెప్పిన విధంగా కాకపోయినా.. పథకాలలో కొన్ని నిబంధనలు పెట్టి అమలు చేస్తున్నారు. ఇక కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ వెనక్కి తగ్గడం లేదు.jagan;amala akkineni;jagan;andhra pradesh;central government;oxygenవెనక్కి తగ్గని జగన్...కరోనాకి స్కీమ్ ఉంటుందా?వెనక్కి తగ్గని జగన్...కరోనాకి స్కీమ్ ఉంటుందా?jagan;amala akkineni;jagan;andhra pradesh;central government;oxygenFri, 14 May 2021 00:00:00 GMTప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఏపీ సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో ప్రజలకు పథకాలు అందిస్తూనే ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, తాను ఇచ్చిన హామీలని వరుసపెట్టి అమలు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో దాదాపు అన్నీ హామీలని అమలు చేశారు. అయితే ముందు చెప్పిన విధంగా కాకపోయినా.. పథకాలలో కొన్ని నిబంధనలు పెట్టి అమలు చేస్తున్నారు. ఇక కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ వెనక్కి తగ్గడం లేదు.


గతేడాది కరోనా సమయంలో పేద ప్రజలకు పథకాలు అందించారు. ఇక ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలో కూడా జగన్ పథకాల అందిస్తూనే ఉన్నారు. ఇటీవలే జగనన్న వసతి దీవెన అందించిన జగన్, తాజాగా రైతులకు రైతు భరోసా స్కీమ్ అమలు చేశారు.


రాష్ట్రంలో 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928 కోట్ల సాయం అందచేశారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందిస్తున్నారు. ఖరీఫ్‌ ముందు మే నెలలో తొలి విడత కింద రూ.7,500, అక్టోబర్‌లో రూ. 4,000, జనవరిలో రూ. 2,000 సాయం ఇస్తున్నారు. అయితే ఇందులో కేంద్రం అందించే సాయం రూ. 6,000 ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 అందించనుంది. అయితే ఈ సమయంలో ప్రజలకు కావాల్సింది పథకాలు కాదని, కరోనా నుంచి ప్రజలని కాపాడాలని అంటున్నారు.


అలాగే ఆక్సిజన్ సమస్య రాకుండా చూసుకోవాలని, ఇంకా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని ప్రజల నుంచి రిక్వెస్ట్‌లు పెరుగుతున్నాయి. ముందు ప్రజలు ఆరోగ్యంతో ఉంటే, తర్వాత పథకాలు తీసుకోవచ్చని చెబుతున్నారు. పోనీ కరోనా నివారణని కూడా ఒక స్కీమ్ కింద పెట్టి సాయం చేయాలని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే కరోనా సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>