CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry6b9d9298-1472-4038-878f-c5281f375770-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry6b9d9298-1472-4038-878f-c5281f375770-415x250-IndiaHerald.jpgరంజాన్ రోజున స్పెషల్ డిషెస్ ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా. అసలే లాక్ డౌన్ అలాగే పండగ పర్వ దినం కావున అందరు ఇళ్లలోనే పండగను జరుపుకుంటున్నారు.అందుకనే ఈరోజు మీ ముందుకు కొన్ని వెరైటీ డిషెస్ ను తీసుకువస్తున్నాము.ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాదామి గోష్ట్: ఈ రెసిపీ చాలా ప్రత్యేకమైన రెసిపీ. ఇందులో బాదంపప్పులతో పాటు ఘుమ ఘుమలాడే మసాలా వేసి వండే మాంసాహార వంటకం ఇది. ఈ వంటకంలో బాదం పప్పు వాడటం వలన, ఇది నోరుంచే వాసనతో పాటు అదిరిపోయే రుచిని సంతరించుకుంటుంది. ఈ వంటకం తప్పకుండా మిమ్మల్ని అందరిIndia herald -special curry;festival;jaan;egg;ramzan;almonds;muslims;john;ishtam;masalaరంజాన్ స్పెషల్ వంటలు మీ కోసం..!రంజాన్ స్పెషల్ వంటలు మీ కోసం..!India herald -special curry;festival;jaan;egg;ramzan;almonds;muslims;john;ishtam;masalaFri, 14 May 2021 12:00:00 GMTరంజాన్ రోజున స్పెషల్ డిషెస్ ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా. అసలే లాక్ డౌన్ అలాగే పండగ పర్వ దినం కావున అందరు ఇళ్లలోనే పండగను జరుపుకుంటున్నారు.అందుకనే ఈరోజు మీ ముందుకు కొన్ని వెరైటీ డిషెస్ ను తీసుకువస్తున్నాము.ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.

బాదామి గోష్ట్:  ఈ రెసిపీ చాలా ప్రత్యేకమైన రెసిపీ. ఇందులో బాదంపప్పులతో పాటు ఘుమ ఘుమలాడే మసాలా వేసి వండే మాంసాహార వంటకం ఇది. ఈ వంటకంలో బాదం పప్పు వాడటం వలన, ఇది నోరుంచే వాసనతో పాటు అదిరిపోయే రుచిని సంతరించుకుంటుంది. ఈ వంటకం తప్పకుండా మిమ్మల్ని అందరిని ఆకర్షిస్తుంది.

షీర్ కోర్మా: షీర్ కోర్మా అనేది ముస్లింల యొక్క అత్యంత ఇష్టమైన సాంప్రదాయ పండుగ అల్పాహారం అన్నమాట. ఈ పండగకి ఈ రెసిపీ తప్పనిసరిగా ఇంట్లో చేయాలిసిందే. ఇది పాలతో చేసే తీపి వంటకం.ఇందులో ఎండు ఖర్జురాల పొడి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఈ వంటకం ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనది మరియు ఈద్ రోజున ఉదయం పూట కుటుంబం సభ్యులతో పాటు అతిథులకు దీన్ని ఇస్తారు.

బాదమ్ ఫిర్ని: అలాగే ఇంకొక  రుచికరమైన వంటకం బాదం ఫిర్నీ. దీనిని బాదాం పప్పుతో చాలా టెస్ట్‌గా తయారుచేస్తారు. అలాగే ఈ రెసిపిలో బాదం పప్పు మిశ్రమం, పాలు మరియు స్వీటెనర్ ఉపయోగించి దీనిని తయారు చేస్తారు.ఒకవిధంగా చెప్పాలంటే తీపిని బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట.

బైడా రోటీ: ఈ వంటకాన్ని గుడ్డుతో తయారు చేస్తారు. గుడ్డు అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ డిష్ ప్రత్యేకమైనది.పరోటా మీద గుడ్డు పూతతో చేసే వంటకం ఇది. అలాగే ఈ బైడా రోటీలో సుగంధ ద్రవ్యాల ముక్కలను కూడా వేస్తారు. వాటి వల్ల రోటికి మంచి టేస్ట్ వస్తుంది. ప్రత్యేక రుచి కోసం పుదీనా సాస్‌తో దీన్ని తీనవచ్చు.

మటన్ కోర్మా: మటన్ కోర్మా అనేది బాగా పాపులర్ అయిన వంటకం అనే చెప్పాలి.మటన్ తినే నాన్ వెజ్ ప్రియులకు ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దీనిని తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైన నాన్‌వెజ్ వంటకం.

సెవియన్: ఇది డెజర్ట్‌గా కూడా పనిచేస్తుంది. ఈ వంటకంలో పాలు, సేమ్యాలను, బెల్లం, లేదా పంచదార, కిస్మిస్, జీడిపప్పు ఉపయోగించి తయారు చేస్తారు. దీనిని ముస్లిమ్స్ బాగా ఇష్టంగా చేస్తారు. ఒక్క ముస్లిమ్స్ మాత్రమే కాకుండా  భారతీయులు కూడా దీన్ని వండడానికి, తినడానికి  ఇష్టపడతారు. సెవియన్ అద్భుతమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. ఈ వంటకంను చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా వండవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయి..!

రంజాన్ స్పెషల్: ఈద్‌లో అసలు ఏం చేస్తారు?

రెండు మూడు నెలల్లో జనసేనలో కీలక పరిణామాలు...?

ఎడిటోరియల్: మహమ్మారి కరోనా పుట్టిల్లు చైనా పురోగమనం - ప్రపంచం తిరోగమనం

ఏపీలో ప్రమాదకరస్దాయిలో కరోనా..సర్కార్ కొత్త మార్గదర్శకాలు..!!

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

దేవుడా.. వ్యాక్సిన్ దోపిడీ లెక్కలు చూస్తే గుండె గుభేలే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>