MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-heroes-88ff4cbb-cac4-42fc-9532-78831be7638b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-heroes-88ff4cbb-cac4-42fc-9532-78831be7638b-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ కేసులు కొద్దిగా తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలను పూర్తిగా నమ్మలేని స్థితిలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు కానీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి సంబంధించిన క్లారిటీ రాదు అని అంటున్నారు. సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ గురించి వస్తున్న వార్తలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి.దీనితో ఈసారి సెకండ్ వేవ్ పరిస్థితులు కొద్దిగా అదుపులోకి వచ్చినా ధియేటర్లను ఓపెన్ చేసే విషయంలో మన తెలుగు రాష్ట్రాలు ఆచితూచి అడుగులు వేస్తాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. గతtop heroes;;business;kranthi;kranti;shyam;makar sakranti;rrr movie;cinema;sankranthi;industryసంక్రాంతి వార్తలు విని కలవర పడుతున్న టాప్ హీరోలు !సంక్రాంతి వార్తలు విని కలవర పడుతున్న టాప్ హీరోలు !top heroes;;business;kranthi;kranti;shyam;makar sakranti;rrr movie;cinema;sankranthi;industryThu, 13 May 2021 11:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ కేసులు కొద్దిగా తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలను పూర్తిగా నమ్మలేని స్థితిలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు కానీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి సంబంధించిన క్లారిటీ రాదు అని అంటున్నారు. సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ గురించి వస్తున్న వార్తలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి.


దీనితో ఈసారి సెకండ్ వేవ్ పరిస్థితులు కొద్దిగా అదుపులోకి వచ్చినా ధియేటర్లను  ఓపెన్ చేసే విషయంలో మన తెలుగు రాష్ట్రాలు ఆచితూచి అడుగులు వేస్తాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. గతంలో లా ఈసారి ధియేటర్ల రీ ఓపెనింగ్ విషయమై ఖంగారు నిర్ణయాలు ఉండకపోవచ్చని ఒకవేళ ధియేటర్లు ఆగష్టు ప్రాంతానికి ఓపెన్ అయినప్పటికీ 50% ఆక్యుపెన్సీ నిబంధనలు వచ్చే ఏడాది సంక్రాంతి వరకు కొనసాగినా ఆశ్చర్యం లేదు అన్న లీకులు వస్తున్నాయి.  



ఇప్పుడు ఈ విషయాలు అన్నీ ఇండస్ట్రీ వర్గాల వరకు చేరడంతో టాప్ హీరోల సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ భారీ సినిమాల నిర్మాతలకు టెన్షన్ మొదలైంది అని అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘పుష్ప’ ‘రాథే శ్యామ్’ ‘సర్కారు వారి పాట’ ‘హరిహర వీరమల్లు’ సినిమాల పై సుమారు 15 వందల కోట్ల పెట్టుబడి బ్లాక్ అయిందని ఈ సినిమాల నిర్మాణం పూర్తి అయినా 100 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు తిరిగి వచ్చేదాక ఈసినిమాల విడుదలకు సంబంధించిన బిజినెస్ పూర్తికాదు కాబట్టి అప్పటి వరకు ఈ సినిమాల విడుదల ఆగితే ఈ మూవీ నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది అన్న వార్తల హడావిడి మొదలైంది.


ఇప్పుడు షూటింగ్ లు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉండి పరిస్థితులను అన్నీ గమనిస్తున్న టాప్ హీరోలు ఈ వార్తల లీకులు పట్ల తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మన తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి అయితే కాని టాప్ హీరోల సినిమాలను కొనుక్కునే బయ్యర్లకు ధైర్యం ఏర్పడే పరిస్థితులు లేవనీ ఇలాంటి పరిస్థితులలో రానున్న 6 నెలలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధింఛి గడ్డుకాలం కొనసాగుతోంది అంటూ వస్తున్న కామెంట్స్ తో టాప్ హీరోలు అంతా కలవర పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>