PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8238abeb-9d02-4dc2-84a6-34bd512b3c71-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8238abeb-9d02-4dc2-84a6-34bd512b3c71-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ నిర్మూలన కోసం భారతదేశం తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రపంచమంతా విమర్శల వర్షం కురిపిస్తోంది. మన దేశానికి వారంతా చెబుతోంది ఒకే ఒక్క విషయం లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో నిర్వహించండి మరియు మరింత కఠినతరంగా కొనసాగించండి. ఎందుకంటే గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో ఇంతటి ప్రమాదం లేకపోవడంతో భారత్ ప్రభుత్వం సెకండ్ వేవ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రపంచదేశాలు అంటున్నాయి. CORONAVIRUS;tiru;varsha;india;andhra pradesh;government;police;coronavirusఆంధ్రాలో కంప్లీట్ లాక్ డౌన్ తప్పేలా లేదే ?ఆంధ్రాలో కంప్లీట్ లాక్ డౌన్ తప్పేలా లేదే ?CORONAVIRUS;tiru;varsha;india;andhra pradesh;government;police;coronavirusThu, 13 May 2021 19:06:20 GMTకరోనా వైరస్ నిర్మూలన కోసం భారతదేశం తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రపంచమంతా విమర్శల వర్షం కురిపిస్తోంది. మన దేశానికి వారంతా చెబుతోంది ఒకే ఒక్క విషయం లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో నిర్వహించండి మరియు మరింత కఠినతరంగా కొనసాగించండి. ఎందుకంటే గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో ఇంతటి ప్రమాదం లేకపోవడంతో భారత్ ప్రభుత్వం సెకండ్ వేవ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రపంచదేశాలు అంటున్నాయి. ఒకరకంగా చూస్తే ఇది వాస్తవమే అని ప్రభుత్వం మరియు ప్రజలంతా ఒప్పుకోక తప్పదు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఐసిఎమ్ఆర్ కొన్ని సూచనలను మరియు సలహాలను మన ముందుకు తీసుకువచ్చింది. ముందుగా రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచండి అని చెప్పారు.

టెస్టుల జరిగే తీరు చూస్తే, ఇక్కడ ఏపీలో ఒక రోజుకి 90 వేల నుండి లక్ష టెస్టులు చేస్తున్నారు. పక్క రాష్ట్రము తెలంగాణలో రోజుకి 50 నుండి 60 వేల టెస్టులను చేస్తోంది. ఈ టెస్టులలో వచ్చే కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. ఈ కరోనా టెస్టుల ఫలితాలలో పాజిటివిటీ శాతం 10 కంటే ఎక్కువగా ఉంటే 4 నుండి 6 వారాల పాటుగా లాక్ డౌన్ విధించమని వీరు సూచించారు. ఈ లాక్ డౌన్ కూడా కేవలం ఒక గంట అనుమతితో కఠినంగా నిర్వహించాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రాలో కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతం ఉంది. ఐసిఎమ్ఆర్ చెప్పిన విధంగా లాక్ డౌన్ విధించాలి. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గతంలో లాగానే రెండు గంటలు మాత్రమే ప్రజలకు అనుమతినిచ్చి, పూర్తి స్థాయి లాక్ డౌన్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.  

అయితే లాక్ డౌన్ విధించినా చర్యలలో మరి కాస్త కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఎందుకంటే ఇచ్చిన కొద్ది సమయం కేవలం అత్యవసర వస్తువులను కొనుక్కోవడానికి మాత్రమే. అయితే ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి సాధారణంగా అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అందరూ మాస్కులను ధరిస్తున్నప్పటికీ సామాజిక దూరం మాత్రం సరిగ్గా పాటించడం లేదు. ఇది మనకు కరోనా కేసులు విస్తరించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం ఇలాంటి వాటిపై కొరడా జులిపించాల్సిన సమయం ఆసన్నమైంది. లాక్ డౌన్ సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుని కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.    



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జైలు నుంచి మళ్లీ ఆస్పత్రికి ధూళిపాళ్ల..రీజన్ ఇదే..!!

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>