MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/who-is-the-father-of-bollywood-superstare1cda54a-3087-442f-b88c-22d904e1d262-415x250-IndiaHerald.jpgరాజకుమారుడు మూవీతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు, ఆ సినిమాతో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాఘవేంద్ర రావు తీసిన ఆ సినిమాలో మహేష్ బాబు యాక్షన్, స్టైల్, అందం వంటివి ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ఆ తరువాత మహేష్ నటించిన యువరాజు మూవీ ఎబోవ్ యావరేజ్ గా నిలవగా దాని అనంతరం వచ్చిన వంశీ మూవీ పరాజయం పాలయింది. కాగా ఆ మూడు సినిమాల తరువాత క్రియేటివ్ దర్శకడు కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ నటించిన మురారి మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని నటుడిగా ఆయనకీ మంచి పేరు తెచ్చిపెట్టింది. mahesh-babu;mahesh;bhumika chawla;prakash raj;gunasekhar;krishna vamshi;mani sharma;raj;vamsi;rajaka;cinema;rajani kanth;huzur nagar;producer;producer1;thief;heroine;film nagar;bobby;donga;murari;raghavendra;takkari dongaమహేష్ తో ఆ స్టార్ ప్రొడ్యూసర్ ప్లానింగ్స్ వర్కౌట్ అవుతాయా ..... ??మహేష్ తో ఆ స్టార్ ప్రొడ్యూసర్ ప్లానింగ్స్ వర్కౌట్ అవుతాయా ..... ??mahesh-babu;mahesh;bhumika chawla;prakash raj;gunasekhar;krishna vamshi;mani sharma;raj;vamsi;rajaka;cinema;rajani kanth;huzur nagar;producer;producer1;thief;heroine;film nagar;bobby;donga;murari;raghavendra;takkari dongaThu, 13 May 2021 23:20:00 GMTరాజకుమారుడు మూవీతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు, ఆ సినిమాతో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాఘవేంద్ర రావు తీసిన ఆ సినిమాలో మహేష్ బాబు యాక్షన్, స్టైల్, అందం వంటివి ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ఆ తరువాత మహేష్ నటించిన యువరాజు మూవీ ఎబోవ్ యావరేజ్ గా నిలవగా దాని అనంతరం వచ్చిన వంశీ మూవీ పరాజయం పాలయింది. కాగా ఆ మూడు సినిమాల తరువాత క్రియేటివ్ దర్శకడు కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ నటించిన మురారి మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని నటుడిగా ఆయనకీ మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆపై వచ్చిన టక్కరి దొంగ పర్వాలేదనిపించగా, దాని అనంతరం రిలీజ్ అయిన బాబీ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే అదే సమయంలో ఎమ్ ఎస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు మూవీ చేసారు మహేష్. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా మణిశర్మ మ్యూజిక్ అందించారు. అప్పట్లో మంచి అంచనాలతో విడుదలైన ఒక్కడు మూవీ అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుని హీరోగా మహేష్ కి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఆ మూవీలో మహేష్ యాక్షన్, గుణశేఖర్ అద్భుతమైన టేకింగ్, సాంగ్స్, భారీ సెట్టింగ్స్ వంటి వాటికి మంచి పేరు వచ్చింది. ఆ మూవీ తరువాత నిర్మాత ఎమ్ రాజు తో మహెష్ మరొక సినిమా చేయనున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ అవి వార్తలు గానే మిగిలిపోయాయి.

ఇక లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అతి త్వరలో ఎమ్ ఎస్ రాజు నిర్మాణం లో సూపర్ స్టార్ ఒక సినిమా చేయనున్నారని, ఇప్పటికే మహేష్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం చేయిస్తున్న రాజు, వీలైనంత త్వరగా దానిని మహేష్ కు వినిపించి ఆయన ఆమోదం అందుకోనున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు టాక్. ఇక రాజు తో ఎప్పటినుండో మరొక మంచి సినిమా చేయాలని చూస్తున్న మహేష్, ప్రస్తుత తన కమిట్మెంట్స్ తరువాత ఈ మూవీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా దీని పై అధికారికంగా వార్త మాత్రం వెలువడాల్సి ఉంది ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలీవుడ్‌నీ వదలని శ్రీరెడ్డి.. రాధే ఓ డస్ట్ బిన్ అంటూ..

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>