PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jestice-nv-ramana7a3c0565-bf13-486d-bb29-d4bff924307e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jestice-nv-ramana7a3c0565-bf13-486d-bb29-d4bff924307e-415x250-IndiaHerald.jpgసుప్రీంకోర్టు నూతన జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టుల కోసం సుప్రీం కోర్టు ఒక ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రోజు యాప్ ను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు సాంకేతిక బృందం ఈ యాప్ ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా సుప్రీంకోర్టులో రోజు జరిగే కార్యకలాపాల వివరాలు జర్నలిస్టులు ఉన్నచోటు నుంచి తెలుసుకుని రిపోర్ట్ చేసేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇక సుప్రీం కోర్టు టెక్నికల్ గా అప్ డేట్ అవుతnv ramana;amala akkineni;ramana;bus;media;court;vఇక లైవ్ లో కోర్టు విచారణలు?ఇక లైవ్ లో కోర్టు విచారణలు?nv ramana;amala akkineni;ramana;bus;media;court;vThu, 13 May 2021 17:11:19 GMTసుప్రీంకోర్టు నూతన జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టుల కోసం సుప్రీం కోర్టు ఒక ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రోజు యాప్ ను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు సాంకేతిక బృందం ఈ యాప్ ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా సుప్రీంకోర్టులో రోజు జరిగే కార్యకలాపాల వివరాలు జర్నలిస్టులు ఉన్నచోటు నుంచి తెలుసుకుని రిపోర్ట్ చేసేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. 


ఇక సుప్రీం కోర్టు టెక్నికల్ గా అప్ డేట్ అవుతుందని పేర్కొన్న ఆయన ఇకమీదట న్యాయస్థానం లో జరిగే అన్ని కార్యకలాపాలను ట్రాన్స్పరెంట్ గా ఉంచేందుకు గాను కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇక మీదట సుప్రీంకోర్టులో జరిగే వాదోపవాదాలు అలాగే ఇతర కార్యకలాపాలు అన్నిటినీ లైవ్ టెలికాస్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్.వి.రమణ వెల్లడించారు. ఈ అంశం మీద మిగతా న్యాయమూర్తులతో చర్చించి మరికొద్ది రోజుల్లో లైవ్ టెలికాస్ట్ చేసే అంశాన్ని వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.


ఇక తాను కెరీర్ మొదట్లో ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని పేర్కొన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తనకు తెలుసు అని పేర్కొన్నారు. అంతేకాక మీడియా, సుప్రీంకోర్టు మధ్య వారధిలా ఉండేందుకుగాను ఒక ప్రత్యేక అధికారిని సైతం నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే మొదటి నుంచి ఇలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉండగా గత చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం అది సరి కాదని అభిప్రాయపడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్.వి.రమణ దాన్ని అమలు చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొనడం గమనార్హం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఏపీ సర్కార్ కి అమర్ రాజా భారీ విరాళం

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>