Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rejena3309dbd5-a62b-4b29-add9-5107f031b982-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rejena3309dbd5-a62b-4b29-add9-5107f031b982-415x250-IndiaHerald.jpgమహేశ్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా 2012లో తెరకెక్కిన ఎస్ఎంఎస్(శివ మనసులో శృతి) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది రెజీనా కాంసాండ్రా. ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. అల్లు శిరీష్‌తో 'రొటీన్ లవ్ స్టోరీ', సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', మాస్ మహారాజ రవితేజతో 'పవర్' వంటి సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో అలరించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు మాత్రం ..rejena;chiranjeevi;mahesh;ram charan teja;ram gopal varma;shiva;shruti;arun vijay;jeevitha rajaseskhar;ram pothineni;sam;samantha;sruthi;sudheer varma;sudigali sudheer;vijay;tollywood;cinema;telugu;kollywood;saaho;tamil;love;lord siva;thriller;heroine;joseph vijay;sardar vallabhai patel;research and analysis wing;sam mendes;mass;raghavendra;love story;chitramఛాన్సులే లేని హీరోయిన్ బంపర్ ఛాన్స్ కొట్టేసిందే..!ఛాన్సులే లేని హీరోయిన్ బంపర్ ఛాన్స్ కొట్టేసిందే..!rejena;chiranjeevi;mahesh;ram charan teja;ram gopal varma;shiva;shruti;arun vijay;jeevitha rajaseskhar;ram pothineni;sam;samantha;sruthi;sudheer varma;sudigali sudheer;vijay;tollywood;cinema;telugu;kollywood;saaho;tamil;love;lord siva;thriller;heroine;joseph vijay;sardar vallabhai patel;research and analysis wing;sam mendes;mass;raghavendra;love story;chitramThu, 13 May 2021 15:54:12 GMTమహేశ్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా 2012లో తెరకెక్కిన ఎస్ఎంఎస్(శివ మనసులో శృతి) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది రెజీనా కాంసాండ్రా. ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. అల్లు శిరీష్‌తో 'రొటీన్ లవ్ స్టోరీ', సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం',  'సుబ్రమణ్యం ఫర్ సేల్', మాస్ మహారాజ రవితేజతో 'పవర్' వంటి సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో అలరించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు మాత్రం వెళ్లలేకపోయింది. దీంతో 'ఎవరు' '7' 'చక్ర' వంటి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ కనిపించింది. దీంతో అడపాదడపా పాత్రలు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో రెజీనాకు కొంత ఛాన్సులు తగ్గిపోయాయి. కానీ తెలుగుతో పాటు తమిళంలోనూ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూ కొన్ని అవకాశాలనైతే పట్టేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ లో ''బోర్డర్'' అనే యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీలో రా ఆఫీసర్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

'బ్రూస్లీ' 'సాహో' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అరుణ్ విజయ్ హీరోగా ''బోర్డర్'' తెరకెక్కుతోంది. దర్శకుడు అరివళగన్  ఈ చిత్రాన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కిస్తున్నాడు.  ఇందులో రెజీనా కసండ్రా - స్టెఫీ పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా రా(ఆర్ఏడబ్ల్యూ) ఆఫీసర్‌గా కనిపించనుందట. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది చిత్ర బృందం. రా ఆఫీసర్ గెటప్‌లో చేతిలో గన్ పట్టుకొని ఉన్న రెజీనా ఇంటెన్స్ లుక్‌లో బాగానే ఉంది. మరి ఈ 'బోర్డర్'తో అయినా అమ్మడి కెరీర్‌కి హర్డిల్స్ తొలగిపోతాయేమో చూడాలి.

ఇదిలా ఉంటే 'బోర్డర్' మూవీని విజయ్ రాఘవేంద్ర నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. ఈ సినిమాను కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇకపోతే రెజీనా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. అంతేకాకుండా సుధీర్ వర్మ డైరెక్షన్‌లో కొరియన్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్' తెలుగు రీమేక్‌ ‘శాకినీ ఢాకినీ’లోనూ లీడ్ రోల్ చేస్తోంది. అంతేకాకుండా అలానే 'నేనే నా...?'(సూర్పనాగై) అనే బైలింగువల్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చైన్ బ్రేక్.. గ్రాండ్ సక్సెస్..!!

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>