PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus0891e0b2-259b-407c-ac2c-0c9d695f8f1c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus0891e0b2-259b-407c-ac2c-0c9d695f8f1c-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా ఇండియా ఇంతకుముందెన్నడూ ఎదుర్కొనని పరిస్థితులతో పోరాడుతోంది. ఇంతటి భయంకర పరిస్థితులు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు పోరాడడానికి మరియు ఒక సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పోరాడడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. CORONAVIRUS;health;india;american samoa;doctor;coronavirusఅమెరికా డాక్టర్: భారత్ ఇలా చేసి ఉంటే ... పరిస్థితి వేరేలా ఉండేది ?అమెరికా డాక్టర్: భారత్ ఇలా చేసి ఉంటే ... పరిస్థితి వేరేలా ఉండేది ?CORONAVIRUS;health;india;american samoa;doctor;coronavirusThu, 13 May 2021 09:00:00 GMTకరోనా కారణంగా ఇండియా ఇంతకుముందెన్నడూ ఎదుర్కొనని పరిస్థితులతో పోరాడుతోంది. ఇంతటి భయంకర పరిస్థితులు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు పోరాడడానికి మరియు ఒక సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పోరాడడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. భారత్ లో గత సంవత్సరం కరోనా మొదటి దశ సమయంలో, మనము ఎంతో ఇబ్బంది పడ్డాము. ఎంతోమంది ప్రజల ప్రాణాలను పోగొట్టుకున్నారు. చైనాతో పాటుగా ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ ప్రభావం చూపింది. ఈ కారణంగా ప్రపంచంలోని పెద్ద పెద్ద డాక్టర్స్ మరియు శాస్త్రవేత్తలు ఈ కరోనాను నివారించడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ ఈ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని గుర్తించారు. దీనిపై జాగ్రత్తగా వ్యవహరించమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలను హెచ్చరించింది.

లాక్ డౌన్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని సలహా ఇచ్చింది. అన్ని దేశాలతో పాటు ఇండియా కూడా లాక్ డౌన్ విధించడంతో మెల్ల మెల్లగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇక్కడే ఇండియా ప్రభుత్వం పప్పులో కాలేసింది.  ఇక కరోనా వైరస్ రాదని భావించారో ఏమో లాక్ డౌన్ ని ఎత్తి వేశారు. మళ్ళీ ఎప్పటిలాగే అన్నింటిపై ఆంక్షలు ఎత్తివేసి ఓపెన్ చేసుకోవడానికి అనుమతులిచ్చింది. దీనితో కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ పేరుతో వచ్చేసింది. ఈ సారి గతంలోకన్నా అధిక ప్రభావాన్ని చూపిస్తోంది. కానీ అమెరికాతో పాటు మిగతా దేశాలు ఈ పరిస్థితుల్ని చూసి వెంటనే భారత్ ను లాక్ డౌన్ విధించమని కోరాయి. ఎంతోమంది వైద్యులు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అయినా కూడా భారత్ వారి మాటలను పెడచెవిన పెట్టి లాక్ డౌన్ పెట్టే విషయంలో ఆలస్యం చేసింది. దీని ప్రభావమే ఇప్పుడు భారత్ ను సర్వనాశనం చేసే దిశగా దూసుకెళ్తోంది.  

ప్రస్తుత భారత్ పరిస్థితిపై అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫాసి, అమెరికా సెనేటర్లతో చర్చించాడు. ఈయన మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతోందని ఇది ప్రపంచ వినాశనానికి దారి తీసేలా ఉందని వారితో చెప్పారు. గతంలో మొదటి దశ సమయంలో భారత్ కరోనా లేదని భావించి లాక్ డౌన్ ఎత్తివేసారని, ఈ నిర్ణయమే ఇప్పుడు భారత్ కొంప ముంచుతోంది అని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా భారత్ మేల్కొని త్వరిత గతిన అవసరమైన చర్యలను తీసుకుంటే పరిస్థితి సద్దుమణిగే అవకాశముంది, అంతే కాకుండా లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తే కానీ ఉపయోగం ఉండదని చెప్పారు. ఈ విషయాలను అమెరికా సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్స్ కమిటీలకు వివరించి చెప్పారు. మరి మన భారత్ భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?

భారత్ బయోటెక్‌పై వైసీపీ విమర్శలు.. ఆంధ్రా ప్రజలకు మేలు చేస్తాయా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఇద్దరికీ నెగిటివ్‌గానే ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>