PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona09367dee-cd81-4387-b7ed-d40978bd680d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona09367dee-cd81-4387-b7ed-d40978bd680d-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక వైరస్ బారినపడి మృతి చెందే వారి సంఖ్య వేలలో నమోదవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక కరోనా దాటికి తట్టుకోలేక ఇప్పటికే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు.corona;kerala;collector;interview;contract;coronavirusదేశంలో అతిపెద్ద కొవిడ్‌కేర్‌ సెంటర్‌ ఇదే..!దేశంలో అతిపెద్ద కొవిడ్‌కేర్‌ సెంటర్‌ ఇదే..!corona;kerala;collector;interview;contract;coronavirusThu, 13 May 2021 11:00:00 GMTదేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక వైరస్ బారినపడి మృతి చెందే వారి సంఖ్య వేలలో నమోదవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక కరోనా దాటికి తట్టుకోలేక ఇప్పటికే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఇక ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన ఆంక్షలతో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతున్నాయి.

ఇక కరోనా వైరస్ ని సమర్థంగా ఎదుర్కొంటున్న కేరళ. అయితే మరో భారీ కార్యక్రమానికి రెడీ అయ్యింది. దేశంలోనే అతిపెద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఇక కొచ్చిలోని అంబలాముగల్‌లో దాదాపు వెయ్యి ఆక్సిజన్‌ పడకలతో కోవిడ్‌ ఫస్ట్‌లైన్‌ చికత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ను కంట్రోల్‌ చేయడానికి కేరళ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఆక్సిజన్‌ కొరతను తీర్చేందుకు రాష్ట్రంలో భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను నిర్మించింది. ఇప్పుడు కోవిడ్ రోగులకు సరిపడా ఆక్సిజన్‌ బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొస్తూ భారీ కరోనా ఆస్పత్రికి ఏర్పాటు చేసింది.

అయితే అంబులాముగల్‌ రిఫైనరీ స్కూల్‌లో వెయ్యి ఆక్సిజన్‌ పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఎర్నాకుళం కలెక్టర్‌ తెలిపారు. కోచి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో సిబ్బంది కోసం ఇప్పటికే ఇంటర్వ్యూలు సైతం పూర్తయ్యాయి. వీరందరినీ కాంట్రాక్ట్‌ బేసెస్‌లో తీసుకుంటున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.

అలాగే కేరళలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని పాజివిటీ రేటు తగ్గడం లేదని అందుకే తాము నివారణ చర్యలను ముమ్మరం చేశామని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ తెలిపారు. ఉప్పెనలాంటి వైరస్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూళ్లు, ప్రభుత్వ భవనాల్లోనేకాదు.. లాడ్జీలు, హాస్టళ్లను సైతం కోవిడ్‌ ఫస్ట్‌లైన్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్లుగా మార్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>