MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/will-the-close-of-theatres-effect-ranas-virataparvame8f45bff-33db-4538-b77e-1c13f47d8f7c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/will-the-close-of-theatres-effect-ranas-virataparvame8f45bff-33db-4538-b77e-1c13f47d8f7c-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా థియేటర్లు మూసి వేయబడటంతో, ఇప్పటికే షూట్ చేసిన అనేక తెలుగు సినిమాల నిర్మాతలు ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తే యోచన చేన్నారు. పెద్ద బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తెలుగు సినిమాల సంగతి పక్కన పెడితే మిగతా సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. అందుకే అలాంటి నిర్మాతలు ఓటీటీల వైపు చూస్తున్నారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, సాయి పల్లవి మరియు రానా జంటగా నటించిన విరాటపర్వం కూడా ఓటీటీ బాటలో నడిచే అవకాశం ఉందని అంటున్నారు. విరాట పర్వం నిర్మాతలు ఇప్పుడుtollywood gossips;rana;geetha;nivetha pethuraj;priyamani;raj;cinema;sangeetha;telugu;tamil;hindi;mass;sai pallavi;bobbili;venu udugulaఓటీటీలోనే విరాటపర్వం?ఓటీటీలోనే విరాటపర్వం?tollywood gossips;rana;geetha;nivetha pethuraj;priyamani;raj;cinema;sangeetha;telugu;tamil;hindi;mass;sai pallavi;bobbili;venu udugulaThu, 13 May 2021 13:00:00 GMTకరోనా కారణంగా థియేటర్లు మూసి వేయబడటంతో, ఇప్పటికే షూట్ చేసిన అనేక తెలుగు సినిమాల నిర్మాతలు ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తే యోచన చేన్నారు. పెద్ద బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తెలుగు సినిమాల సంగతి పక్కన పెడితే మిగతా సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. అందుకే అలాంటి నిర్మాతలు ఓటీటీల వైపు చూస్తున్నారని అంటున్నారు.  తాజా సమాచారం  ప్రకారం, సాయి పల్లవి మరియు రానా జంటగా నటించిన విరాటపర్వం కూడా ఓటీటీ బాటలో నడిచే అవకాశం ఉందని అంటున్నారు. 


విరాట పర్వం నిర్మాతలు ఇప్పుడు రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు ప్రారంభించారని అంటున్నారు. సరైన ఆఫర్ కనుక తగిలినట్లు అయితే వారు నేరుగా సినిమా డిజిటల్ రైట్స్ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు అదిరిపోయే ఓటీటీ ఆఫర్స్ వస్తున్నట్టు చెబుతున్నారు. ఏకంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ అయితే ముప్పై కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. 


నక్సల్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా ప్రధానంగా పొలిటికల్‌ జానర్ లో తెరకెక్కిస్తున్నా సరే మాస్ ఎలిమెంట్స్ ని కూడా బాగా ఎంగేజ్ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో  ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఆచంట గోపీనాథ్ నిర్మించారు. డి. సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోనాల్ గజ్జర్ బర్త్ డే స్పెషల్..

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>