BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yarcp-mp-raghuramakrishnamraju-complaint-to-sp-and-speker8094bad1-a0e4-4733-9f56-cea1dcb80c56-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yarcp-mp-raghuramakrishnamraju-complaint-to-sp-and-speker8094bad1-a0e4-4733-9f56-cea1dcb80c56-415x250-IndiaHerald.jpgఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. క‌రోనా వైర‌స్ ఉద్ధృతి తగ్గేవరకు ఎన్నికల నిర్వహణ ఉండదని స్పష్టం చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ చేపడతామని తెలిపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీల విషయంపై ఇటీవల ఈసీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తెలిపింది.elections;kcr;srinivas;delhi;telangana;mla;minister;letter;central government;june;election commission;reddy;etela rajenderఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీelections;kcr;srinivas;delhi;telangana;mla;minister;letter;central government;june;election commission;reddy;etela rajenderThu, 13 May 2021 16:45:02 GMTఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. క‌రోనా వైర‌స్ ఉద్ధృతి తగ్గేవరకు ఎన్నికల నిర్వహణ ఉండదని స్పష్టం చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ చేపడతామని తెలిపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీల విషయంపై ఇటీవల ఈసీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తెలిపింది.

తెలంగాణ‌లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద జూన్ 3వ తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా...గ‌వ‌ర్న‌ర్ కోటాలో మ‌రో ఎమ్మెల్సీ స్థానం జూన్ 16వ తేదీన‌ ఖాళీ కానుంది.శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి,డిప్యూటీ ఛైర్మ‌న్ నేతి విద్యాసాగ‌ర్‌,క‌డియం శ్రీహ‌రి, ఫ‌రీదుద్దీన్‌, ఆకుల ల‌లిత‌,బోడ‌కుంటి వెంకటేశ్వ‌ర్లు,గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డిల  ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం ముగియ‌నుంది.

ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండ‌టంతో ఆశావాహులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేమ‌ని ఈసీ చెప్ప‌డంతో వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్లైంది.ఎమ్మెల్సీ రేస్‌లో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు,పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు అనేక మంది సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు.ఇటు ప‌ద‌వి అయిపోతున్న ఎమ్మెల్సీల‌కు మ‌ళ్లీ కొన‌సాగింపు ఉంటుందా లేదా కొత్త వారికి అవ‌కాశాలు ఇస్తారా అనే దానిపై ఆశావాహుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు టెన్ష‌న్ నెల‌కొంది. కొత్త‌గా ఎమ్మెల్సీలు వ‌చ్చిన త‌రువాతే మంత్రివ‌ర్గ  విస్త‌ర‌ణ ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.తాజాగా ఈసీ నిర్ణ‌యంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కూడా ఆగిపోయిన‌ట్లే అని విశ్లేష‌కులు అంటున్నారు.ఎన్నిక‌లు బాగా ఆల‌స్యం అయితే మాత్రం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను త్వ‌రలోనే చేసేందుకు సీఎం కేసీఆర్ స‌న్నాహాలు చేస్తున్నారు.ఈటెల రాజేందర్ భ‌ర్త‌ర‌ఫ్‌తో ఆ స్థానం ఖాళీ ఉండ‌టంతోపాటు ఆ శాఖ కూడా ప్ర‌స్తుతం కీల‌కంగా ఉండ‌టంతో త‌క్ష‌ణం ఆ శాఖ ఖాళీని భ‌ర్తీ చేయాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో ఆస్పత్రిలో చేరిన భారత క్రికెటర్ తండ్రి..!!

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>