MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi-32301850-d853-4cfd-8f62-637c91ed127c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi-32301850-d853-4cfd-8f62-637c91ed127c-415x250-IndiaHerald.jpgచిరంజీవి మోహన్ బాబులు ఇంచుమించు ఒకేసమయంలో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. అప్పట్లో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ఇప్పటికీ వీరిద్దరి మధ్య కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఎదో ఒక చిన్న గ్యాప్ ఉంది అన్నవార్తలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. గతంలో వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ‘బిల్లా రంగా’ అప్పట్లో వీరిద్దరూ నటించిన హిట్ మూవీ. ఆరోజులలో వీరిద్దరినీ కలిపి గిరిబాబు ఒక మల్టీ స్టారర్ తీయాలని ప్రయత్నాలు చేసాడట. ‘ఫైవ్ మెన్ ఆర్మీ’ ‘గ్రేట్ ఎస్కేప్’ లాంటి సినిమాల స్పూర్తితో ఒక జంగిల్ బేస్డ్ అడ్వెchirangeevi;;cbn;chiranjeevi;bhanu;bhanuchander;editor mohan;mohan babu;suman;cinema;army;heroineచిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !chirangeevi;;cbn;chiranjeevi;bhanu;bhanuchander;editor mohan;mohan babu;suman;cinema;army;heroineThu, 13 May 2021 09:00:00 GMTచిరంజీవి మోహన్ బాబులు ఇంచుమించు ఒకేసమయంలో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. అప్పట్లో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ఇప్పటికీ వీరిద్దరి మధ్య కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఎదో ఒక చిన్న గ్యాప్ ఉంది అన్నవార్తలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి.


గతంలో వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ‘బిల్లా రంగా’ అప్పట్లో వీరిద్దరూ నటించిన హిట్ మూవీ. ఆరోజులలో వీరిద్దరినీ కలిపి గిరిబాబు ఒక మల్టీ స్టారర్ తీయాలని ప్రయత్నాలు చేసాడట. ‘ఫైవ్ మెన్ ఆర్మీ’ ‘గ్రేట్ ఎస్కేప్’ లాంటి సినిమాల స్పూర్తితో ఒక జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేసుకున్న గిరిబాబు వీరిద్దరినీ కలిసి ఆ కథను వినిపించడంతో వారిద్దరూ ఆ కథకు ఓకె చెప్పారట.



ఆతరువాత ఈమూవీ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తరువాత చిరంజీవి మోహన్ బాబుల మధ్య అప్పటికే ఉన్న ఒక చిన్న గ్యాప్ ఈమూవీ సెట్స్ పైకి వెళ్ళకుండా చేసిందట. ఈమూవీ కథ రీత్యా ఇద్దరు హీరోలకి ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ చిరంజీవికి హీరోయిన్ తో పాటుగా ఒక డ్యూయెట్ పెట్టినట్లే తనకు కూడా పెట్టమని మోహన్ బాబు అప్పట్లో కోరాడట. అయితే అలా చేస్తే కథకు సంబంధించిన కథనం పూర్తిగా దెబ్బ తింటుందని గిరిబాబు ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయానికి అప్పట్లో మోహన్ బాబు అంగీకరించలేదట.


దీనితో ఇక ఏమి చేయలేక ఆమూవీ ప్రాజెక్ట్ ను సుమన్  భానుచందర్ లతో ‘మెరుపుదాడి’ అన్న మూవీగా తీసి గిరిబాబు విడుదల చేసాడట. ఆతరువాత ఈ సినిమా హిట్ కావడంతో ఈమూవీని చూసిన మోహన్ బాబు చిరనజీవి లు ఒక మంచి సినిమాను పోగొట్టుకున్నాము అంటూ బాధ పడ్డారట. ఇప్పటికీ ఎంత గ్యాప్ ఉన్నప్పటికీ మోహన్ బాబు చిరంజీవిలు బయట కనిపిస్తే చాలు ఒకరి పై ఒకరు ప్రేమను కురిపిస్తూ కనిపిస్తారు. అయితే వీరిద్దరూ తమతమ కెరియర్ లో పూర్తిగా ఎదిగిన తరువాత కలిసి నటించిన సినిమాలు లేవు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విద్యుత్‌ ధర లో తగ్గింపు ..లాక్ డౌన్ ఎఫెక్ట్

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?

భారత్ బయోటెక్‌పై వైసీపీ విమర్శలు.. ఆంధ్రా ప్రజలకు మేలు చేస్తాయా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఇద్దరికీ నెగిటివ్‌గానే ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>