MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayasudha-5b282dcf-3af2-445f-8dbd-fa9604dc911a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayasudha-5b282dcf-3af2-445f-8dbd-fa9604dc911a-415x250-IndiaHerald.jpgజయసుధను సహజ నటి అంటారు. అప్పట్లో బరువైన పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రెస్. గట్టిగా ఇరవై ఏళ్ళు కూడా నిండకుండానే జ్యోతి అనే సినిమాలో టిపికల్ రోల్ ప్లే చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె మొదటి నుంచి చక్కని పాత్రలకు ఇంపార్టెంట్ ఇస్తూ తన టాలెంట్ కి ఎప్పటికపుడు పదును పెట్టుకుంటూ వచ్చిన నటీమణి. jayasudha;jayaprada;jayasudha;jyothi;nageshwara rao akkineni;tara;director;silver;heroine;makeup;fashion;silver screen;fidaaజయసుధను అలా చూపించిన డైరెక్టర్ ఆయనే... ?జయసుధను అలా చూపించిన డైరెక్టర్ ఆయనే... ?jayasudha;jayaprada;jayasudha;jyothi;nageshwara rao akkineni;tara;director;silver;heroine;makeup;fashion;silver screen;fidaaThu, 13 May 2021 11:00:00 GMTజయసుధను సహజ నటి అంటారు. అప్పట్లో బరువైన పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రెస్. గట్టిగా ఇరవై ఏళ్ళు కూడా నిండకుండానే జ్యోతి అనే సినిమాలో టిపికల్ రోల్ ప్లే చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె మొదటి నుంచి చక్కని పాత్రలకు ఇంపార్టెంట్ ఇస్తూ తన టాలెంట్ కి ఎప్పటికపుడు పదును పెట్టుకుంటూ వచ్చిన నటీమణి.

ఇదిలా ఉంటే జయసుధ హీరోయిన్ గా చేస్తున్న టైమ్ లోనే  జయప్రద కూడా పోటీగా ఉండేది. జయప్రద ఎక్కువగా గ్లామర్ రోల్స్ వేసేవారు.  స్టార్ హీరోలు కూడా గ్లామర్ కోసం ఆమెకే ఫస్ట్  ప్రయారిటీ ఇచ్చేవారు. మరి జయసుధ గ్లామర్ రోల్స్ వేయలేదా లేక ఆమెకు అలాంటి అవకాశాలు దక్కలేదా అన్నది ఒక చర్చ. అయితే జయసుధ కూడా మంచి అందగత్తె. పైగా ఆమె మేకప్ ఎక్కువగా అవసరం లేకుండానే వెండి తెర మీద నిండుగా కనిపించే నటీమణి. అయితే ఆమె ఎంచుకున్న పాత్రలు, మహిళా చిత్రాలు కారణంగా ఆమె గ్లామర్ చట్రం నుంచి బయటకు వచ్చేశారు.

ఆమె ఇరవై ఏళ్ళ వయసులోనూ గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే అందరి హీరోయిన్లను అత్యంత అందంగా చూపించే కె రాఘవేంద్రరావు మాత్రం తన సినిమాల్లో జయసుధను గ్లామరస్ గా చూపించారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన కేడీ నంబర్ వన్, ఆమె కధ వంటి చిత్రాలలో జయసుధ గ్లామరస్ గానే కనిపిస్తుంది. జయసుధ చేత ఆ రోజులలో ఉన్న ఫ్యాషన్ డ్రెస్ లను ధరింప చేసి నాటి యూత్ ఫిదా అయ్యేలా రాఘవేంద్రరావు  చూపించారని చెబుతారు.

అయితే జయసుధలోని అద్భుతమైన నటనను రాబట్టేందుకే మిగిలిన దర్శకులు ఎక్కువగా చూసేవారు. అలాంటి వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు ముందు వరసలో ఉంటారు. ఆయన జయసుధతో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేయించి ఆమెకి చిరకీర్తి దక్కేలా చేశారు. మొత్తానికి కెరీర్ ఆరంభంలో జయసుధ గ్లామర్ పాత్రలను కొన్ని  వేశారు.   రామక్రిష్ణ హీరోగా వచ్చిన నోము సినిమాతో పాటు అక్కినేని నాగేశ్వరరావు  మహాకవి క్షేత్రయ్య  సినిమాలలో  ఆమె చేసిన సాంగ్స్ అలాంటివే. కానీ ఆమె ఉత్తమ నటీమణిగానే తెలుగు వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు ఎక్కువగా చేసి శభాష్ అనిపించుకున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>