ViralN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona5400587a-7f52-45d9-a460-b0f447435239-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona5400587a-7f52-45d9-a460-b0f447435239-415x250-IndiaHerald.jpgవిశాఖ‌ప‌ట్నం: క‌న్న తండ్రిమీద ప్రేమ‌తో ఓ కొడ‌కు స్వీప‌ర్ అవ‌తార‌మెత్తాడు. ఏ ఉద్యోగం దొర‌క్క‌పోవ‌డంతో అత‌ను స్వీప‌ర్‌గా చేర‌లేదు. క‌రోనా బారిన‌ప‌డిన త‌న తండ్రిని చూసుకునేందుకు ఆ ఆసుప‌త్రిలో స్వీప‌ర్‌గా చేరాడు.పూర్తివివ‌రాల్లోకి వెళ్లితే అక్క‌య్య‌పాలెంకి చెందిన మ‌ధుకిష‌న్ ఎంబీఏ పూర్తి చేశారు.ప్ర‌భుత్వానికి సంబంధించిన కాల్ సెంట‌ర్ లో ఏడాదిన్న‌ర‌గా ప‌ని చేస్తున్నారు.అయితే కొన్ని రోజుల క్రితం ఆయ‌న తండ్రి సుద‌ర్శ‌న్ రావు క‌రోనాబారిన ప‌డ్డారు. చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. సీఎస్‌ఆరcarona;vishakapatnam;fatherస్వీప‌ర్ అవ‌తార‌మెత్తిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!స్వీప‌ర్ అవ‌తార‌మెత్తిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!carona;vishakapatnam;fatherThu, 13 May 2021 15:32:00 GMTవిశాఖ‌ప‌ట్నం: క‌న్న తండ్రిమీద ప్రేమ‌తో ఓ కొడ‌కు స్వీప‌ర్ అవ‌తార‌మెత్తాడు. ఏ ఉద్యోగం దొర‌క్క‌పోవ‌డంతో అత‌ను స్వీప‌ర్‌గా  చేర‌లేదు. క‌రోనా బారిన‌ప‌డిన త‌న తండ్రిని చూసుకునేందుకు ఆ ఆసుప‌త్రిలో స్వీప‌ర్‌గా చేరాడు.పూర్తివివ‌రాల్లోకి  వెళ్లితే అక్క‌య్య‌పాలెంకి చెందిన మ‌ధుకిష‌న్ ఎంబీఏ పూర్తి చేశారు.ప్ర‌భుత్వానికి సంబంధించిన కాల్ సెంట‌ర్ లో  ఏడాదిన్న‌ర‌గా ప‌ని చేస్తున్నారు.అయితే కొన్ని రోజుల క్రితం ఆయ‌న తండ్రి సుద‌ర్శ‌న్ రావు క‌రోనాబారిన ప‌డ్డారు. చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ నాలుగో అంతస్తులోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల తర్వాత సుదర్శనరావు స్నానాల గదిలో పడిపోవడంతో దెబ్బతగిలి రక్తం బాగా కారింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆయన తన కుమారులకు ఫోన్‌ చేసి చెప్పారు. వారు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌, వైద్యులకు ఫిర్యాదు చేయడంతో దెబ్బలకు చికిత్స చేశారు.

అయితే అక్కడున్న సిబ్బంది తండ్రిని పట్టించుకోవడం లేదని మధుకిషన్‌కు తెలిసింది. తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన దగ్గర ఉండాలని అనుకున్నా బయటవారిని ఆసుప‌త్రిలోప‌లికి అనుమతించరని తెలిసి పారిశుద్ధ్య కార్మికుడిగా ఆసుపత్రిలో చేరారు.రాత్రి డ్యూటీలో విధుల‌కు హాజ‌రైన మ‌ధుకిష‌న్ త‌న‌ తండ్రి చికిత్స పొందుతున్న పడక దగ్గరికి వెళ్లి చూడగా కనిపించ లేదు. ప‌క్క‌నే మరుగుదొడ్డి గది వరండాలో పడిపోయి ఉన్నారు. ఆ దృశ్యం చూసి  ఒక్క‌సారిగా మధుకిషన్ ఖంగుతిన్నారు. అదే వార్డులో ఉన్న ఓ వ్యక్తి వచ్చి ఆయన ఎప్పుడో చనిపోయాడని చెప్పడంతో అక్క‌డే బోరున విలపించారు.

ఆసుపత్రి ఫ్లోర్‌ సూపర్‌వైజర్‌, అక్కడి పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని మధు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ ఇన్‌ఛార్జి, కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు మధుకిషన్‌ ఫిర్యాదు చేశారు.రాత్రి సమయంలో తన తండ్రి మరుగుదొడ్డి వరండాలో పడిపోతే ఎవరూ పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు.త‌న తండ్రి బాగోగులు చూసుకునేందుకు కొడుకుప‌డిన త‌ప‌న అంద‌రిని కంట‌త‌డి పెట్టిస్తుంది.చివ‌రికి సుద‌ర్శ‌న్‌రావుమృతి చెంద‌డంతో  కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెలుగులోకి నయా కుంభకోణం.. జనాలను పిచ్చోళ్ళని చేశారే?

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>