NRISuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/nri-news4895b76b-391e-4011-8cc3-92f0d29237d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/nri-news4895b76b-391e-4011-8cc3-92f0d29237d0-415x250-IndiaHerald.jpgకరోనా పోరులో భారత్ కి అండగా ఉండేందుకు ఎన్నారైలు కోవిడ్ 19 చికిత్సకు సంబంధించి వైద్య పరికరాలను భారతదేశానికి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన తెలుగు ఎన్నారైలు "తెలుగు కోవిడ్ టాస్క్ ఫోర్స్" ఫోరమ్ ఏర్పాటు చేసి పల్స్ ఆక్సి మీటర్స్, శానిటైజర్స్, గ్లోవ్స్, ఫేస్ మాస్క్స్, పీపీఈ కిట్స్, మందులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మండలాలను దత్తత తీసుకున్నారు. డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ పి.రవి రాజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎనnri news;ravi anchor;tiru;india;godavari river;mandula;andhra pradesh;tirupati;village;husband;local language;indian;petta;nagariఆంధ్రప్రదేశ్‌కు ఎన్నారైలు సాయం..?ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నారైలు సాయం..?nri news;ravi anchor;tiru;india;godavari river;mandula;andhra pradesh;tirupati;village;husband;local language;indian;petta;nagariThu, 13 May 2021 09:00:00 GMTకరోనా పోరులో భారత్ కి అండగా ఉండేందుకు ఎన్నారైలు కోవిడ్ 19 చికిత్సకు సంబంధించి వైద్య పరికరాలను భారతదేశానికి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన తెలుగు ఎన్నారైలు "తెలుగు కోవిడ్ టాస్క్ ఫోర్స్" ఫోరమ్ ఏర్పాటు చేసి పల్స్ ఆక్సి మీటర్స్, శానిటైజర్స్, గ్లోవ్స్, ఫేస్ మాస్క్స్, పీపీఈ కిట్స్, మందులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మండలాలను దత్తత తీసుకున్నారు.


డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ పి.రవి రాజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నారై వైద్యులైన సరస్వతి, రుద్రరాజు ఏర్పాటుచేసిన ఫోరమ్ 10 లక్షల రూపాయల విలువైన వైద్య సామాగ్రిని దానం చేసిందని.. వాటిని తిరుపతి, నగరి నియోజకవర్గాల్లో పంపిణీ చేశామని చెప్పారు. త్వరలోనే ఎమర్జెన్సీ కొరియర్ సేవల ద్వారా మరిన్ని వైద్య పరికరాలను పంపిణీ చేస్తామని ఎన్నారైలు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.



చిత్తూరు జిల్లాలోని వడమాల పేట, పుత్తూరు, నగరి, విజయపురం, నిండ్ర వంటి మండలాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని తోండంగి, ద్రాక్షారం, ఇంజారాం, పెద్దాపురం, అన్నవరం మండలాలను తెలుగు ఎన్నారైలు దత్తత తీసుకున్నట్టు రవి రాజు తెలిపారు. మరిన్ని మండలాల బాగోగులు చూసుకునేందుకు త్వరలోనే మరికొందరు వైద్యులు తెలుగు కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఫోరమ్ లో చేరబోతున్నారని ఆయన అన్నారు.



ప్రస్తుతం దత్తత తీసుకున్న మండలాల్లోని కోవిడ్ చికిత్స అందించే వైద్య సిబ్బందికి తెలుగు ఎన్నారై సీనియర్ డాక్టర్లు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. దత్తత తీసుకున్న మండలాలలోని ప్రతి గ్రామంలోని మెడికల్, పారామెడికల్ సిబ్బందికి అవసరమైన పరికరాలను పంపిణీ చేసేందుకు కూడా ఇండియన్ అమెరికన్లు ఆలోచనలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులలో వర్చువల్ సెషన్స్ ద్వారా స్థానిక వైద్యులకు సలహాలు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధం అని తెలుగు సీనియర్ ఎన్ఆర్ఐ డాక్టర్లు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?

భారత్ బయోటెక్‌పై వైసీపీ విమర్శలు.. ఆంధ్రా ప్రజలకు మేలు చేస్తాయా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఇద్దరికీ నెగిటివ్‌గానే ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>