MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips1e443484-6f19-4f26-bd5d-9eefc88e4bbc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips1e443484-6f19-4f26-bd5d-9eefc88e4bbc-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా తన సినిమాలతో వసూళ్ల సునామి సృష్టిస్తాడు.అలా తన కెరీర్ లో చాలా సినిమాలు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇక సల్మాన్ ప్రభుదేవా కాంబో గురించి చెప్పనవసరం లేదు. గతంలో వీరిరువురి కాంబినేషన్ లో వచ్చిన 'వాంటెడ్' సినిమా సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.అలాగే వీరి కాంబోలో 'దబాంగ్ 3' కూడా వచ్చింది. ఆ సినిమా పెద్ద ప్లాప్ అయింది.ఇక మూడోసారి వీరtollywood-gossips;view;prabhu deva;salman khan;bollywood;cinema;netizens;jaan;dabang 3;dhabhang;hero;ramzan;dabangg;john;wanted;raccha'రాధే' రివ్యూ.. సల్మాన్ దెబ్బకి క్రాష్ అయిపోయిన జీ 5 యాప్..'రాధే' రివ్యూ.. సల్మాన్ దెబ్బకి క్రాష్ అయిపోయిన జీ 5 యాప్..tollywood-gossips;view;prabhu deva;salman khan;bollywood;cinema;netizens;jaan;dabang 3;dhabhang;hero;ramzan;dabangg;john;wanted;racchaThu, 13 May 2021 19:00:00 GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా తన సినిమాలతో వసూళ్ల సునామి సృష్టిస్తాడు.అలా తన కెరీర్ లో చాలా సినిమాలు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇక సల్మాన్ ప్రభుదేవా కాంబో గురించి చెప్పనవసరం లేదు. గతంలో వీరిరువురి కాంబినేషన్ లో వచ్చిన 'వాంటెడ్' సినిమా సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.అలాగే వీరి కాంబోలో 'దబాంగ్ 3' కూడా వచ్చింది. ఆ సినిమా పెద్ద ప్లాప్ అయింది.ఇక మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'రాధే'.ఈ సినిమాను ముందుగా ఒకేసారి థియేటర్స్‌తో పాటు డిజిటల్‌లో పే ఫర్ వ్యూ ప్రకారం రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక వీరు ప్రకటించిన సమయంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంత ఉదృతి లేదు. కానీ సల్మాన్ ఖాన్ తాను యాక్ట్ చేసిన చిత్రాన్ని ఈద్ సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు నుంచి నిర్ణయించుకున్నారు.


గత సంవత్సరమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. కానీ ఈ సారి మాత్రం రంజాన్ కు రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్న సల్మాన్ ఈ సినిమాను జీ 5లో మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్ చేసారు.సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో నటించిన సినిమా విడుదల అవ్వడంతో జీ 5 యాప్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. థియేటర్స్ విడుదలైతే.. ఆ రచ్చ మాములుగా ఉండదు. అలాంటిది ఓటీటీలో విడుదల కావడంతో దాదాపు 1 మిలియన్ పైగా వ్యూయర్స్ ఒక్కసారిగా హిట్స్ చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని జీ 5 వాళ్లు తెలియజేశారు. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది.


ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే ఇదొక రొటీన్ సినిమా అని నెటిజన్స్ తేల్చేశారు. సినిమా చాలా బోరింగ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. పాత కాలం నాటి కథతో ప్రభుదేవా ఈ సినిమాని చాలా పేలవంగా తెరకెక్కించాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఒక్క సిటీమార్ సాంగ్ మినహా మిగతా పాటలు వినసొంపుగా లేవని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాని సల్మాన్ క్రేజ్ వల్ల ఈ సినిమా భారీ స్థాయిలో వ్యూస్ ని రాబట్టింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆంధ్రాలో కంప్లీట్ లాక్ డౌన్ తప్పేలా లేదే ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>