PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/sreereddya1ad9bd1-fe95-4f1f-a247-f8d0cd6ae7a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/sreereddya1ad9bd1-fe95-4f1f-a247-f8d0cd6ae7a0-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రాజుగారు, అదే పార్టీపై రివర్స్ అయ్యి రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉంటూ నిత్యం రచ్చబండ కార్యక్రమం పేరిట మీడియా సమావేశం నిర్వహిస్తూ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.sreereddy;pawan;nithya new;pawan kalyan;raghu;ramakrishna;varsha;jagan;andhra pradesh;2019;mp;government;media;loksabha;king;cheque;tdp;ycp;sri reddy;sajjala ramakrishna reddyరాజుగారు వర్సెస్ శ్రీరెడ్డి: అప్పుడు పవన్‌ మేటర్‌లో బాబు తప్పులేదా?రాజుగారు వర్సెస్ శ్రీరెడ్డి: అప్పుడు పవన్‌ మేటర్‌లో బాబు తప్పులేదా?sreereddy;pawan;nithya new;pawan kalyan;raghu;ramakrishna;varsha;jagan;andhra pradesh;2019;mp;government;media;loksabha;king;cheque;tdp;ycp;sri reddy;sajjala ramakrishna reddyThu, 13 May 2021 02:00:00 GMTఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రాజుగారు, అదే పార్టీపై రివర్స్ అయ్యి రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉంటూ నిత్యం రచ్చబండ కార్యక్రమం పేరిట మీడియా సమావేశం నిర్వహిస్తూ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


ఇక రాజు గారికి చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం ఎప్పటినుంచో చూస్తుంది. ఆయనని ఎంపీ పదవినుంచి తప్పించాలని లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇక రాజు గారు టార్గెట్‌గా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయిలో మాట్లాడతారో తెలిసిందే. ఇక రాజు గారు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వారికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


తాజాగా రాజుగారి విమర్శలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్‌గా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వారిపై వ్యక్తిగతంగా మాటల దాడి చేశారు. దీంతో ఎప్పుడు వివాదాల్లో ఉండే నటి శ్రీరెడ్డి బయటకొచ్చింది. రాజుగారిని టార్గెట్ చేసింది. ఆయనపై బూతుల వర్షం కురిపించింది. ఇక రాజు గారు సైతం శ్రీరెడ్డికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇద్దరి పోరులో మరోసారి పవన్ కల్యాణ్ మేటర్ తెరపైకి వచ్చింది.


గతంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్‌పై ఎలాంటి విమర్శలు చేసిందో అందరికీ తెలిసిందే. ఆయనపై వ్యక్తిగతంగా మాటల దాడి చేసింది. అయితే అప్పుడు శ్రీరెడ్డిని టీడీపీనే మాట్లాడించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని వైసీపీ నేతలు కూడా బాగా ప్రచారం చేశారని, కానీ జరిగిన మేటర్ వేరు అని, తాజాగా రాజుగారు చెబుతున్నారు. అప్పుడు, ఇప్పుడు శ్రీరెడ్డి వెనుక ఉన్నది వైసీపీనే అని గట్టిగా చెబుతున్నారు. అయితే ఈ విషయం రాజుగారు చెప్పకపోయినా రాజకీయం తెలిసినవారికి క్లియర్‌గానే అర్ధమవుతుంది. ఇక రాజు గారు, శ్రీరెడ్డిల మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుందో చూడాలి.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>