PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eid-mubarak59b0ba96-f1f0-4247-b6fc-ef7a1e10cd59-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eid-mubarak59b0ba96-f1f0-4247-b6fc-ef7a1e10cd59-415x250-IndiaHerald.jpgముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి "ఈద్‌ ముబారక్"‌ తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని సిఎం ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని జగన్ అన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం eid mubarak;pawan;kalyan;jagan;janasena;festival;jaan;chief minister;ramzan;janasena party;john;manam;reddy;divya bhatnagarవారికి జగన్, పవన్ శుభాకాంక్షలు...!వారికి జగన్, పవన్ శుభాకాంక్షలు...!eid mubarak;pawan;kalyan;jagan;janasena;festival;jaan;chief minister;ramzan;janasena party;john;manam;reddy;divya bhatnagarThu, 13 May 2021 18:00:00 GMTముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి "ఈద్‌ ముబారక్"‌ తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని సిఎం ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని జగన్ అన్నారు.

పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాహ్ ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారు అని జగన్ పేర్కొన్నారు. అల్లాహ్ రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ,  బీద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు అని జగన్ అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణల మేలు కలయిక పవిత్ర రంజాన్ మాసం అని అన్నారు.  ప్రతి ముస్లిం సోదరుడు సోదరీమణి నెల రోజులపాటు ఉపవాస దీక్షలు నిష్టతో చేస్తారు అని ఆయన వివరించారు. వారందరికీ నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు.  మనందరం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించి పర్వదినాలు చేసుకోవాల్సి వస్తోంది అన్నారు. మత పెద్దలు సూచించిన విధంగా... తగు జాగ్రత్తలతో రంజాన్ వేడుకలు చేసుకోవాలని కోరుతున్నాను అన్నారు.  మానవాళిని కరోనా పీడ త్వరగా వీడిపోవాలని- మీరు చేసే పవిత్ర ప్రార్థనల్లో కోరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క ఉపిరితిత్తితో కరోనాని జయించిన నర్స్.. !

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>