QuotesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maachimaataba59ec25-3c65-4fdf-8d3d-e1043799a36b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/maachimaataba59ec25-3c65-4fdf-8d3d-e1043799a36b-415x250-IndiaHerald.jpgఇంట్లో గోర్లను ఎందుకు కత్తిరించకూడదు ? ఇంట్లో గోర్లను కత్తిరించడం వల్ల పొరపాటున మనం అన్నం తినేటప్పుడు ఆ గోర్లు అన్నంలోకి పడితే, మనం తెలియకుండానే భుజిస్తాము. అలా తిన్నప్పుడు ఆ గోర్లను జీర్ణం చేసే శక్తి మన జీర్ణవ్యవస్థకు లేదు. ఒకవేళ విసర్జించే టప్పుడు పేగులకు ఈ గోర్లు తగిలితే ప్రమాదకరం. అందుకే గోళ్లను ఇంట్లో తియ్యకూడదు అని అంటారు. కానీ ఆరు బయట వారానికొకసారి కచ్చితంగా గోర్లను కత్తిరించాలి. అలా కత్తిరించిన గోర్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి.. ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే శుభం కలుగుతుంది ? ఉదయాMAACHIMAATA;deva;jeevitha rajaseskhar;prasanna;tara;pregnant;v;shaktiమంచిమాట : మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు వల్ల కలిగే అనర్ధాలు ఏంటో తెలుసా ?మంచిమాట : మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు వల్ల కలిగే అనర్ధాలు ఏంటో తెలుసా ?MAACHIMAATA;deva;jeevitha rajaseskhar;prasanna;tara;pregnant;v;shaktiThu, 13 May 2021 06:00:00 GMT
ఇంట్లో గోర్లను ఎందుకు కత్తిరించకూడదు ?
ఇంట్లో గోర్లను కత్తిరించడం వల్ల పొరపాటున మనం అన్నం తినేటప్పుడు ఆ గోర్లు అన్నంలోకి పడితే, మనం తెలియకుండానే భుజిస్తాము. అలా తిన్నప్పుడు ఆ గోర్లను జీర్ణం చేసే శక్తి మన జీర్ణవ్యవస్థకు  లేదు. ఒకవేళ  విసర్జించే టప్పుడు పేగులకు ఈ గోర్లు తగిలితే ప్రమాదకరం. అందుకే గోళ్లను ఇంట్లో తియ్యకూడదు అని అంటారు. కానీ ఆరు బయట వారానికొకసారి కచ్చితంగా గోర్లను కత్తిరించాలి. అలా కత్తిరించిన గోర్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి..

ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే శుభం కలుగుతుంది ?
ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు దేవాలయానికి, సాయంకాలం పరమేశ్వరుని దేవాలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల నుంచి విముక్తి కలిగించడానికి ఉదయాన్నే శ్రీమహావిష్ణువును పూజించడం మంచిది. ఇక మహేశ్వరుడు లయకారుడు. సాయంత్రం సమయంలో పూజించడంవల్ల పరమశివుడు మరింత ప్రసన్నుడౌతాడు. కాబట్టి మనసుకు ప్రశాంతత చేర్చుకొని, పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి..

నీటిని, పాలను ,మజ్జిగను ఏ సమయంలో తాగాలి ?
ఉదయం లేవగానే మంచినీటిని, మధ్యాహ్నం మజ్జిగను, రాత్రి పడుకునే ముందు పాలను తాగడం ఉత్తమం. భోజనం చేసేటప్పుడు కుడివైపున నీళ్లను ఉంచుకోవాలి. ఎడమ వైపున ఉంటే ముద్ద ముద్ద కు నీరు  తాగుతారు కాబట్టి, కుడివైపున ఉంచుకోవడం మంచిది. ముద్ద ముద్ద కు నీటిని తాగడం వల్ల కడుపు నిండా నీళ్లు వెళ్తాయే తప్ప, భోజనం వెళ్ళదు కాబట్టి తినేటప్పుడు నీటిని తాగరాదు..


ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎలా నడవాలి ?
మనలో చాలామంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు తొందరగా అయిపోవాలి అన్నట్టు గబగబా నడుస్తూ ఉంటారు. వింటి నుండి బాణం దూసుకు పోయినట్టుగా మరికొందరు నడుస్తారు. ఇలా ప్రదక్షిణలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు నడిచే లాగా అడుగులో అడుగు వేసుకుంటూ, దేవుడు స్మరణ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. అలాగే మధ్యాహ్నం, అర్ధరాత్రిల్లు  దైవ దర్శనాలు చేసుకోకూడదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బొత్స ఆధిపత్యానికి గండికొట్టే నాయకుడు ఎవరో?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>