Spiritualityyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ramadan9c81b567-2e02-45e8-86c9-9f9348446129-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ramadan9c81b567-2e02-45e8-86c9-9f9348446129-415x250-IndiaHerald.jpgముస్లింలకు అత్యంత ప్రధానమైన పండుగ రంజాన్. రంజాన్ నెలలో ముస్లింలంతా కఠిన ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్థారు. ఈ దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం వంటి మహత్తరమైన సుగుణాలను పెంపొందించడమే. అంతేకాకుండా మనుషులంతా ఒక్కటనే భావన ప్రజల్లో పెంపొందుట, ఆహారం పట్ల వ్యామోహాన్ని తగ్గించడం వంటి అనేకానేక ఫలితాలను ఆశించి నిర్వహించేదే ఉపవాస దీక్ష. అయితే రంజాన్ పండుగలో ఈ ఉపవాస దీక్షకు ఎంత విలువుందో..ramadan;bhavana;deva;manu;sampada;tara;festival;jaan;mosque;ramzan;john;divya bhatnagar;santoshamరంజాన్ స్పెషల్: ఐక్యతకు చిహ్నం జకాత్రంజాన్ స్పెషల్: ఐక్యతకు చిహ్నం జకాత్ramadan;bhavana;deva;manu;sampada;tara;festival;jaan;mosque;ramzan;john;divya bhatnagar;santoshamThu, 13 May 2021 22:11:09 GMTముస్లింలకు అత్యంత ప్రధానమైన పండుగ రంజాన్. రంజాన్ నెలలో ముస్లింలంతా కఠిన ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్థారు. ఈ దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం వంటి మహత్తరమైన సుగుణాలను పెంపొందించడమే. అంతేకాకుండా మనుషులంతా ఒక్కటనే భావన ప్రజల్లో పెంపొందుట, ఆహారం పట్ల వ్యామోహాన్ని తగ్గించడం వంటి అనేకానేక ఫలితాలను ఆశించి నిర్వహించేదే ఉపవాస దీక్ష. అయితే రంజాన్ పండుగలో ఈ ఉపవాస దీక్షకు ఎంత విలువుందో.. అంతే విలువ జకాత్‌కు కూడా ఉంటుంది. జకాత్ అంటే మన తోటి వారికి అండగా ఉండడం. వారి కష్టాలను మనం పంచుకోవడం. వారికి అండగా ఉండి మనవంతుగా వారికి సాయం అందించడం.ఆనందాన్ని పంచడం.

ప్రధానంగా సంపన్నులు, ఆర్థికంగా స్థిరపడిన వారు రంజాన్ మాసంలో జకాత్ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుంచి పేదలకు దానం చేయాలి. అది అతడి సంపదలో రెండున్నర శాతం(2.5%) ఉండాలి. దీనిని ధన, వస్తు రూపంలో నిరుపేదలకు దానంగా ఇవ్వవలసి ఉంటుంది. అంటే జకాత్ ముఖ్య ఉద్దేశం పేదవారు కూడా సంతోషంగా పండుగ జరుపుకొనేలా చేయడమే.

ఇదిలా ఉంటే.. ఇస్లామీయ కేలండర్ ప్రకారం రంజాన్ 9వ మాసం. ఈ నెలలోనే ‘దివ్య ఖురాన్’ అవిర్భవించిందని ముస్లింల నమ్మకం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా రంజాన్‌ను ముస్లింలంతా భావిస్తారు. ఈ పావన సమయంలో భక్తితో ఉపవాసం చేసిన వారి అన్ని తప్పులనూ అల్లా మన్నిస్తాడని, వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతారు ముస్లింలు. వీరంతా ‘రయ్యాన్’ అనే ప్రత్యేక ద్వారం నుంచి స్వర్గ ప్రవేశం చేస్తారనీ పవిత్ర ఖురాన్‌లో ఉంది. కాగా.. రేపు రంజాన్ వేడుక సందర్భంగా అనేకమంది ముస్లింలు ఉపవాస దీక్షలను వదిలిపెడతారు. పెద్ద ఎత్తున మసీదుల్లో ప్రార్థనలు చేసి అల్లాను ప్రార్థిస్తారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్లాష్ బ్యాక్ ని మోడీ మరచిపోవాల్సిందే... ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>