Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya2e99bff6-5221-4c45-9ff8-c46778b667be-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya2e99bff6-5221-4c45-9ff8-c46778b667be-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. ప్రత్యేక పాత్రలతో తనదైన స్టైల్లో పాత్రలకు జీవం పోస్తుంటాడు. అందుకే సూర్య సినిమాలంటేనే సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. కోలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు మిగతా భాషల సినీ ఇండస్ట్రీల్లో కూడా సూర్యకు మంచి పేరుంది. ఈ క్రమంలోనే అతడి సినిమాలు కూడా సూపర్ హిట్లు కొడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలో రిలీజైన ‘సూరారై పొట్రు’ సూపర్ హిట్ అయింది. ఇదే సినిమా తెలుగులో..surya;aparna;geetha;surya sivakumar;tara;india;korea, south;cinema;sangeetha;telugu;kollywood;remake;hero;shanghai;research and analysis wing;chitramసూర్య సినిమాకు అరుదైన గౌరవం.. అక్కడ కూడా..సూర్య సినిమాకు అరుదైన గౌరవం.. అక్కడ కూడా..surya;aparna;geetha;surya sivakumar;tara;india;korea, south;cinema;sangeetha;telugu;kollywood;remake;hero;shanghai;research and analysis wing;chitramThu, 13 May 2021 22:35:18 GMTసౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. ప్రత్యేక పాత్రలతో తనదైన స్టైల్లో పాత్రలకు జీవం పోస్తుంటాడు. అందుకే సూర్య సినిమాలంటేనే సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. కోలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు మిగతా భాషల సినీ ఇండస్ట్రీల్లో కూడా సూర్యకు మంచి పేరుంది. ఈ క్రమంలోనే అతడి సినిమాలు కూడా సూపర్ హిట్లు కొడుతుంటాయి. ఈ క్రమంలోనే గతేడాది నవంబరు 12న ఓటీటీలో రిలీజైన ‘సూరారై పొట్రు’ సూపర్ హిట్ అయింది. ఇదే సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఎయిర్ దక్కన్ అధినేత గోపీనాథ్ బయపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సూర్యకు మరో హిట్ సినిమాను అందించింది. హీరోగా సుధకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఈ సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించాడు. సూర్య 40వ సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. కరోనా నేపథ్యంలో థియేటర్లు లేకపోవడంతో ఓటీటీకే పరిమితమైనా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఇక తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆసియాలోనే మంచి పేరుంది. ఈ ఫెస్టివల్‌లో ఓ సినిమా ఎంపిక కావడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు దర్శకనిర్మాతలు. అయితే ఇప్పుడు సూరారై పొట్రు సినిమా కూడా ఈ ఫిలిం ఫెస్టివల్‌లో పనోరమా విభాగంలో స్క్రీనింగ్‌కి ఎంపికైంది. దీంతో సూర్య కెరీర్లో ఇదో గొప్ప అనుభూతిగా మిగిలిపోనుంది. కాగా.. ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు కూడా కొందరు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>