EditorialMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiinpressuef6b77e37-15db-48de-9a29-ae955bbae7fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modiinpressuef6b77e37-15db-48de-9a29-ae955bbae7fe-415x250-IndiaHerald.jpgదేశ ప్ర‌జ‌లంతా ఇప్ప‌డు కోవిడ్ వైర‌స్‌ తీవ్ర‌త‌తో ఎన్న‌డూ లేనంత అభ‌ద్ర‌తా భావానికి లోన‌వుతున్నారు. వ‌రుస‌గా నాలుగు రోజులపాటు 4 ల‌క్ష‌ల‌కు పైగా న‌మోద‌వుతూ వ‌చ్చిన కొత్త కేసుల సంఖ్య‌ కాస్త త‌గ్గి మూడున్న‌ర ల‌క్ష‌లకు వ‌చ్చినా మ‌ర‌ణాల సంఖ్య నిత్యం నాలుగు వేల‌కు పైగానే ఉంటోంది. ఇది ప్ర‌పంచంలోనే అత్య‌ధికం. వైద్య సౌక‌ర్యాల లేమి, ఆక్సిజ‌న్‌, వ్యాక్సిన్ల కొర‌తతో ప‌లు రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ సంక్షోభాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొనే చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ModiinPressue;view;nithya new;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;jammu and kashmir - srinagar/jammu;west bengal - kolkata;narendra modi;mohandas karamchand gandhi;congress;media;prime minister;cabinet;minister;rahul sipligunj;letter;local language;oxygen;narendraమోదీ మౌనం వ్యూహాత్మ‌క‌మా.. నిష్క్రియాప‌ర‌త్వ‌మా..?మోదీ మౌనం వ్యూహాత్మ‌క‌మా.. నిష్క్రియాప‌ర‌త్వ‌మా..?ModiinPressue;view;nithya new;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;jammu and kashmir - srinagar/jammu;west bengal - kolkata;narendra modi;mohandas karamchand gandhi;congress;media;prime minister;cabinet;minister;rahul sipligunj;letter;local language;oxygen;narendraThu, 13 May 2021 23:04:29 GMTదేశ ప్ర‌జ‌లంతా ఇప్ప‌డు కోవిడ్ వైర‌స్‌ తీవ్ర‌త‌తో ఎన్న‌డూ లేనంత అభ‌ద్ర‌తా భావానికి లోన‌వుతున్నారు. వ‌రుస‌గా నాలుగు రోజులపాటు 4 ల‌క్ష‌ల‌కు పైగా న‌మోద‌వుతూ వ‌చ్చిన కొత్త కేసుల సంఖ్య‌ కాస్త త‌గ్గి మూడున్న‌ర ల‌క్ష‌లకు వ‌చ్చినా మ‌ర‌ణాల సంఖ్య నిత్యం నాలుగు వేల‌కు పైగానే ఉంటోంది. ఇది ప్ర‌పంచంలోనే అత్య‌ధికం. వైద్య సౌక‌ర్యాల లేమి, ఆక్సిజ‌న్‌, వ్యాక్సిన్ల కొర‌తతో ప‌లు రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ సంక్షోభాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొనే చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వాల్సిన ప్ర‌ధాని మోదీ మౌనాన్ని ఆశ్ర‌యించ‌డంపై విప‌క్షనేత‌లతో పాటు ప్ర‌జ‌ల నుంచి కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాని మోదీ కూడా కనిపించకుండా పోయారని, మనకు మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, మోదీ ఫొటోలేనని రాహుల్ తాజాగా వ్యాఖ్యానించారు.

మోదీ మౌనానికి కార‌ణ‌మేమిటి..
మోదీ ప్ర‌స్తుతమున్న ప‌రిస్థితుల్లో మౌన‌ముద్ర వ‌హించ‌డాన్నిఏవిధంగా అర్థం చేసుకోవాల‌నే అంశంపై ఇప్ప‌డు ప‌లుర‌కాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వం అంటే మొత్తం క్యాబినెట్ ఉమ్మ‌డి బాధ్య‌త‌. కానీ మోదీ ప్ర‌ధాని అయ్యాక ప్ర‌భుత్వాన్ని వ‌న్‌మేన్ షోగా మార్చేశారు. బీజేపీ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలుగా చెప్పుకునే కాశ్మీర్ అంశం, ట్రిపుల్ త‌లాక్‌పై నిషేధం, పౌర‌స‌త్వ బిల్లు వంటివి మోదీ ఘ‌న‌త‌గానే ప్ర‌చారం చేసుకున్నారు. అంతెందుకు కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త మొద‌లుకాక‌ముందు భార‌త్‌లోని కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తే ప్ర‌పంచానికి ఔష‌ధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ దేశంగా మోదీ హ‌యాంలోనే ఎదిగిన‌ట్టుగా ఆయ‌న భ‌క్తులు ప్ర‌చారం చేశారు. ఇదే స‌మ‌యంలో నోట్ల ర‌ద్దుతో మొద‌లై, ర‌ఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్య‌వ‌హారం, గ‌త ఏడాది లాక్‌డౌన్‌లో ప్ర‌జ‌లు, వ‌ల‌స‌కూలీలు ప‌డిన న‌ర‌క‌యాత‌న, సొంత రాష్ట్రం గుజ‌రాత్‌కు చెందిన బ‌డా వ్యాపారుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు త‌దిత‌ర‌ వైఫ‌ల్యాల‌ను అనుకూల మీడియా అండ‌తో విజ‌య‌వంతంగా అధిగ‌మించామ‌ని భావించారు. కానీ ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఊహించ‌ని స్థాయిలో పెరిగిపోతోంద‌ని తెలుసుకోలేక‌పోయారు.

వరుస పరాజయాలతో షాక్...
బెంగాల్ ఎన్నిక‌ల్లో మోదీ బృందం అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను వాడి గెలుపు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ క్షేత్ర‌స్థాయి వాస్త‌వాల‌ను ఈ ఎన్నిక‌లు క‌ళ్ల‌ముందు నిలిపాయి. బెంగాల్‌లో శృంగ‌భంగం అయింది. అంతేకాదు, ఉత్త‌ర ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా బీజేపీకి షాక్ ఇచ్చాయి. అక్క‌డ బీజేపీ హ‌వాకు గండి ప‌డింద‌ని అవి తేల్చి చెప్పాయి.ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసి లోనూ వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. ఇక‌ క‌ర్నాట‌క‌లో అయితే కార్పొరేషన్లు, మున్సిపాలిటిలు, నగర పాలకసంస్ధలు కలిపి 163 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 140 చోట్ల కాంగ్రెస్ బంపర్ మెజారిటితో గెలిచింది. జేడీఎస్ 66 చోట్ల గెలిచి, బీజేపీని మూడో స్థానానికి నెట్టేసింది. గ‌త ఏడేళ్ల‌లో బీజేపీకి ఇలాంటి చేదు ఫ‌లితాలు రావ‌డం ఇదే తొలిసారి. విజ‌యాల‌ను ఒంట‌రిగా ఆస్వాదించిన మోదీ ఇప్పుడీ ప‌రాజ‌యాల‌కు, వైఫ‌ల్యాల‌కు కూడా తాను మాత్ర‌మే బాధ్య‌త వ‌హించాల్సిన ప‌రిస్థితిని అనివార్యంగా కొనితెచ్చుకున్నారు.దీనికితోడు ఊహ‌కంద‌ని ఉత్పాతంలా విరుచుకుప‌డిన కోవిడ్ మ‌హ‌మ్మారి మోదీ ప్ర‌భ‌ను మ‌రింత మ‌స‌క‌బార్చింది. దీనితో ఏం చేయాలో తెలియని అచేత‌నావ‌స్థ‌లోకి చేరిపోయారు ప్ర‌ధాని మోదీ. మొక్కుబ‌డిగా అప్పుడ‌ప్పుడూ ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ప‌రిస్థితుల‌పై చ‌ర్చించినా స‌రైన ప‌రిష్కారం చూప‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అందుకే ప‌లు రాష్టాల ముఖ్య‌మంత్రులు ప్ర‌స్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన‌ చ‌ర్య‌ల‌పై ప్ర‌ధానికి ఘాటుగా లేఖ రాశారు. దీనిపై ఆయ‌న ఇప్ప‌టిదాకా స్పందించ‌లేదు. అయితే మోదీకి సంక్షోభాలు కొత్త‌కాద‌ని, ఆయ‌నది అంత తేలిక‌గా ఓట‌మిని అంగీకరించే మ‌న‌స్త‌త్వం కాద‌ని బీజేపీ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌ధాని మౌనం వెనుక త‌ప్ప‌కుండా ప‌దునైన‌ వ్యూహం ఏదో దాగి ఉంటుంద‌ని మోదీ భ‌క్తులు భావిస్తున్నారు. వీటిలో ఏది నిజ‌మో తెలియడానికి ఎంతోకాలం వేచి ఉండ‌న‌క్క‌ర‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స కోసం హైదరాబాద్ రావాలంటే.. ఇవిగో కొత్త రూల్స్..!?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>