EditorialVijayaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/covid-19-corona-virus-ruia-hospital-sworna-hospital-chandrababu-lokeshc81e9f6e-91a1-4b37-b194-7f15c43d8a48-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/covid-19-corona-virus-ruia-hospital-sworna-hospital-chandrababu-lokeshc81e9f6e-91a1-4b37-b194-7f15c43d8a48-415x250-IndiaHerald.jpgనిజానికి ఇక్కడ టీడీపీ తరపున కమిటియే అవసరం లేదు. ఎందుకంటే జరిగిన ఘటన ఆక్సిజన్ అందకకాదు అని ప్రభుత్వం చెబితే తప్పుపట్టాలి. రోగులు చనిపోవటానికి ప్రభుత్వం చెబుతున్నది, ప్రతిపక్షాలు చెబుతున్నది అంతా ఒకటే కారణం. కాబట్టి ప్రత్యేకించి కమిటి వేశారంటే మరో రెండురోజులు ఘటనపై రచ్చచేయటానికి తప్ప ఇంకేమీలేదు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే చంద్రబాబు హయాంలో రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా 30 మంది తొక్కిసలాటలో చనిపోయారు. మరప్పుడు తెలుగుదేశంపార్టీ తరపున నిజనిర్ధారణ కమిటి ఏర్పాటయ్యిందా ? అధికారంలో ఉన్నపార్టీ ప్రభుత్వంపైcovid 19 corona virus ruia hospital sworna hospital chandrababu lokesh;cbn;tiru;yajamanya;telugu desam party;jagan;telugu;government;tirupati;industry;husband;tdp;central government;oxygen;reddy;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడు ఈ నిజనిర్ధారణ కమిటిలు ఎందుకేయలేదు ?హెరాల్డ్ ఎడిటోరియల్ : అప్పుడు ఈ నిజనిర్ధారణ కమిటిలు ఎందుకేయలేదు ?covid 19 corona virus ruia hospital sworna hospital chandrababu lokesh;cbn;tiru;yajamanya;telugu desam party;jagan;telugu;government;tirupati;industry;husband;tdp;central government;oxygen;reddy;partyThu, 13 May 2021 05:00:00 GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతసేపు ప్రత్యర్ధులపై బురదచల్లేసి తాను ఎలా లబ్దిపొందాలా అని మాత్రమే చూస్తుంటారు. మిగిలిన జనాలు ఎలాపోయినా పర్వాలేదు కేవలం తాను లాభపడితే చాలనుకునే మనస్తత్వం చంద్రబాబుది. ఇపుడీ విషయాలు ఎందుకంటే తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయిన ఘటనపై పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటి వేసినట్లు ప్రకటించారు. పార్టీ తరపున కమిటి వేసి ఏమిటి ఉపయోగం అంటే ఏమీ లేదనే చెప్పాలి. పార్టీ తరపున వేసే కమిటి రిపోర్టు నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదు. ఎలాగూ పార్టీ కమిటి ఇచ్చే నివేదిక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పే పడుతుందనటంలో సందేహంలేదు. కాబట్టి ప్రత్యేకించి నిజనిర్ధారణ కమిటి అనేది కేవలం డ్రామా మాత్రమే.




నిజానికి ఇక్కడ టీడీపీ తరపున కమిటియే అవసరం లేదు. ఎందుకంటే జరిగిన  ఘటన ఆక్సిజన్ అందకకాదు అని ప్రభుత్వం చెబితే తప్పుపట్టాలి. రోగులు చనిపోవటానికి ప్రభుత్వం చెబుతున్నది, ప్రతిపక్షాలు చెబుతున్నది అంతా ఒకటే కారణం. కాబట్టి ప్రత్యేకించి కమిటి వేశారంటే మరో రెండురోజులు ఘటనపై రచ్చచేయటానికి తప్ప ఇంకేమీలేదు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే చంద్రబాబు హయాంలో రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా 30 మంది తొక్కిసలాటలో చనిపోయారు. మరప్పుడు తెలుగుదేశంపార్టీ తరపున నిజనిర్ధారణ కమిటి ఏర్పాటయ్యిందా ? అధికారంలో ఉన్నపార్టీ ప్రభుత్వంపై ఎక్కడైనా నిజనిర్ధారణ కమిటి వేస్తుందా ? అని అడుగుతారేమో ? కరెక్టే తనపైన తానే కమిటి వేసుకోదు కదా ఏ అధికారపార్టీ కూడా.




మరలాంటపుడు పోయినసంవత్సరం విజయవాడలోని స్వర్ణాకోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం గుర్తుందా. ఆ ప్రమాదంలో 11 మంది సజీవ దహనమైపోయారు. ఆ ప్రమాధ ఘటన మీద చంద్రబాబు నిజనిర్ధారణ కమిటి వేశారా ? టీడీపీ ప్రతిపక్షంలోనే ఉందికదా ? జగన్ ప్రభుత్వంలో జరిగిన అగ్నిప్రమాధ ఘటనపై పార్టీ తరపున ఎందుకని నిజనిర్ధారణ కమిటి వేయలేదు ? పైగా ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యంపై యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే వద్దని చంద్రబాబు వాదించారే ? ఎందుకని అడ్డుతగిలారు ? అంటే స్వర్ణా కోవిడ్ కేంద్రం యాజమాన్యం కమ్మోరదని, పైగా తనకు అత్యంత సన్నిహితుడు, ఫ్యామిలి డాక్టరైన పోతినేని రమేష్ ది కాబట్టే. అంటే కమ్మోరిది, టీడీపీ వాళ్ళదైతే ఒకలాగ వ్యవహరిస్తారు. అదే  ప్రభుత్వాసుప్రతిది అయితే మాత్రం వెంటనే గోల మొదలుపెట్టేసి, పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటి వేసేస్తారు. మొత్తానికి చంద్రబాబు వైఖరే విచిత్రంగా ఉంటుందనటానికి ఇదే నిదర్శనం.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బొత్స ఆధిపత్యానికి గండికొట్టే నాయకుడు ఎవరో?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>