GoldSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesb708f21a-01b1-48c2-84e6-23699e6ee34f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesb708f21a-01b1-48c2-84e6-23699e6ee34f-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి..నిన్న పైకి కదిలిన బంగారం ధర ఈరోజు నేలచూపులు చూసింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడంతో దేశీ మార్కెట్‌లో అదే ట్రెండ్ నడుస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. అక్షయ తృతీయ ముందు రోజు ఇలా తగ్గడంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. gold rates;hyderabad;rbi;gold;good news;vegetable market;silver;central government;international;good newwzపసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి..!!పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి..!!gold rates;hyderabad;rbi;gold;good news;vegetable market;silver;central government;international;good newwzThu, 13 May 2021 14:17:04 GMTపసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి..నిన్న పైకి కదిలిన బంగారం ధర ఈరోజు నేలచూపులు చూసింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడంతో దేశీ మార్కెట్‌లో అదే ట్రెండ్ నడుస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. అక్షయ తృతీయ ముందు రోజు ఇలా తగ్గడంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.210 పడిపోయింది. రూ.48,560కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 క్షీణించింది. దీంతో రేటు రూ.44,500కు తగ్గింది. ఇక వెండి ధరలు చూస్తే.. గురువారం వెండి ధర దిగొచ్చింది. రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,900కు క్షీణించింది. అంటే తులం వెండి ధర దాదాపు రూ.759 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. కాగా వెండి ధర గత ఏడాది ఆగస్ట్ నెలలో ఏకంగా రూ.79 వేలకు పైగా పెరిగిన విషయం తెలిసిందే.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1817 డాలర్లకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగింది.వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 27.24 డాలర్లకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధరలు తగ్గడం వల్ల దేశీ మార్కెట్‌లోనూ వెండి రేటు దిగివచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన సినీ తారలు మెచ్చిన టూరిస్ట్ ప్రదేశాలు..?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>