HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sapota-helth603fb766-9207-4e35-b4be-86f5f56a72e9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sapota-helth603fb766-9207-4e35-b4be-86f5f56a72e9-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ వచ్చి, ఎంతో మందిని బలి తీసుకుంటోంది. పైగా వైరస్ సోకి , కొత్త లక్షణాలతో భయపెడుతోంది. సాధారణంగా శ్వాస ఆడకపోవడం, జ్వరం, దగ్గు,తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాసన తెలియక పోవడం, నీరసం వంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంతవరకు అందరూ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వంటివి పాటించడం వలన కరోనా బారిన పడకుండా ఉండవచ్చు. అయితే సపోటా అద్భుతమైన రుచిని అందించే పండే కాకుండా ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంది. అవేమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుSAPOTA, HELTH;vitamin a;iron;vitamin;cancerసపోటా పండు తినడం వల్ల ఇన్ని లాభాలా !సపోటా పండు తినడం వల్ల ఇన్ని లాభాలా !SAPOTA, HELTH;vitamin a;iron;vitamin;cancerThu, 13 May 2021 20:00:00 GMT
కరోనా సెకండ్ వేవ్ వచ్చి, ఎంతో మందిని బలి తీసుకుంటోంది. పైగా వైరస్ సోకి , కొత్త లక్షణాలతో భయపెడుతోంది. సాధారణంగా శ్వాస ఆడకపోవడం, జ్వరం, దగ్గు,తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాసన తెలియక పోవడం, నీరసం వంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంతవరకు అందరూ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వంటివి పాటించడం వలన కరోనా బారిన పడకుండా ఉండవచ్చు. అయితే సపోటా అద్భుతమైన రుచిని అందించే పండే కాకుండా ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంది. అవేమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1).సపోటా పండ్లు తినడం వల్ల కంటి చూపును మెరుగుపడుతుంది.

2). సపోటా లో A విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వృద్ధాప్యంలో కూడా కంటిచూపును మెరుగుపరుస్తుంది.

3). సపోటాలో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇవ్వడంలో ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా క్రీడాకారులకు సపోటా పండ్లు తినడం వల్ల వెంటనే శక్తిని పొందవచ్చు.

4). సపోటా నొప్పులను, మంటను తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా యాంటీ- ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.

5). విటమిన్ ఏ,బి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. సపోటా లో యాంటీఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ ఏ వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

6). క్యాల్షియం,పాస్పరస్, ఐరన్ అధిక మొత్తంలో ఉండడం వల్ల ఎముకలు చాలా గట్టిగా తయారవుతాయి. అవి ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి.

7). చాతి పట్టేసినప్పుడు, దీర్ఘకాలిక దగ్గు తగ్గడానికి సపోటా పండు దోహద పడుతుంది.

8). సపోటా పండు ఏదైనా గాయం అయినప్పుడు రక్తస్రావాన్ని అరికడుతుంది.

9). ఈ పండు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.

కాబట్టి ఈ సీజన్లో విరివిగా దొరికే  సపోటా పండ్లను తిని ఆరోగ్యంగా ఉండండి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సంచలన చిత్రం 'బిచ్చగాడు'కి 5 ఏళ్ళు.. ఆ రికార్డు దీనికే సొంతం..

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>