Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda4d1d3f50-5b82-48a5-8988-5f14f08e6950-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda4d1d3f50-5b82-48a5-8988-5f14f08e6950-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ట హీరోగా పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాడి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలయ్య త్రి పాత్రాభినయంతో నట విశ్వరూపం చూపించబోతున్నాడని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఈ సారి హ్యాట్రిక్ సక్సెస్..akhanda;balakrishna;boyapati srinu;poorna;pragya jaiswal;simhaa;srikanth;industries;cinema;industry;director;tsunami;heroine;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;yashasvi jaiswal;chitramఅఖండలో ఆమె కాసేపే.. మళ్లీ కనపడదా..?అఖండలో ఆమె కాసేపే.. మళ్లీ కనపడదా..?akhanda;balakrishna;boyapati srinu;poorna;pragya jaiswal;simhaa;srikanth;industries;cinema;industry;director;tsunami;heroine;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;yashasvi jaiswal;chitramThu, 13 May 2021 16:09:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ట హీరోగా పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాడి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలయ్య త్రి పాత్రాభినయంతో నట విశ్వరూపం చూపించబోతున్నాడని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఈ సారి హ్యాట్రిక్ సక్సెస్ పక్కా అనే టాక్ వినిపిస్తోంది. 

సాధారణంగా వీరిద్దరి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు అంత ప్రాధాన్యం ఉండదు. ఇంతకుముందు సినిమాల్లో కూడా ఇది కనిపించింది. అయితే ఆయన తాజా చిత్రంలో కూడా హీరోయిన్ల పాత్రలు ఇదే తరహాలో ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. అందులోనూ సెకండ్ హీరోయిన్‌ క్యారెక్టర్ తెరపై కనిపించేదే కొంచెం సేపేనట. అలా వచ్చి ఇలా వెళ్లిపోవడానికే ఆమె క్యారెక్టర్‌ను బోయపాటి డిజైన్ చేశారని రూమర్.

అఖండ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా పూర్ణ కూడా కనిపించబోతోంది. కంచె సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్‌కు ఆ సినిమా మినహా మరొక్క హిట్ కూడా లేదు. దాంతో ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఆమె ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఆఫీసర్ అయినా.. ఆ  గ్లామర్‌ ఒలకబోయడంలో ఏ మాత్రం లోటుంచదట ఈ అమ్మడు. ఇక మరో హీరోయిన్‌గా చేస్తున్న పూర్ణ బాలకృష్ణ సీనియర్ క్యారెక్టర్‌కు భార్యగా నటించబోతోందని సమాచారం. ఆమె క్యారెక్టర్ సెకండాఫ్ లో వస్తుందట.

అలాగే చాలా తక్కువ సమయమే తెరపై కనిపిస్తుందని, ప్లాష్ బ్యాక్‌లో వచ్చే పాత్ర కావడంతో అంత స్కోప్ కూడా ఈ పాత్రకు ఉండదని అంటున్నారు. దాదాపు గెస్ట్ రోల్‌లా అలా వచ్చి ఇలా వెళ్లిపోయేలా ఆమె పాత్ర ఉంటుందని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. బాలయ్య వంటి పెద్ద స్టార్ పక్కన సినిమా కావడం, ఇండస్ట్రీలో ఆమెకు అంత గొప్ప రోల్స్ కూడా రాకపోవడంతో క్యారెక్టర్ చిన్నదైనా పూర్ణ ఒప్పుకుందట. అంతే కాదు బాలయ్య సినిమా తర్వాత అయినా.. ఆమెకు సినిమా అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.

ఇదిలా ఉంటే బాలయ్య అఘోరాగా మైమరపించబోతున్నాడు. రీసెంట్‌గా టైటిల్ రివియల్ సందర్భంగా రిలీజ్ చేసిన  చిన్న టీజర్‌లో బాలయ్య అఘోరాగా కనిపించి ఓ డైలాగ్ చెబుతాడు. ఈ చిన్న వీడియో యూట్యూబ్‌లో రికార్డుల సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్‌గా శ్రీకాంత్ నటించబోతున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>