MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actorsa55ab2a1-981a-424e-989f-8f37cd345d4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actorsa55ab2a1-981a-424e-989f-8f37cd345d4e-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో చాలా మంది నటులు కెరీర్ లో మంచిగా రాణిస్తున్న సమయంలోనే అర్దాంతరంగా మృతి చెందారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా. ఇక టిఎన్ఆర్ కెరీర్ చాలా బాగా నడుస్తున్న సమయంలో.. నటుడిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న సమయంలో జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ కరోనాతో కన్నుమూసాడు.actors;chiranjeevi;irrfan khan;shankar nag;soundarya;sushant singh;anand malayalam actor;bharathi old;jeevitha rajaseskhar;m s narayana;shankar;srihari;sushanth;tiru;tirupathi swamy;bollywood;telugu;tirupati;tamil;jayalakshmi;husband;comedian;hero;anand deverakonda;divya bhatnagarఇండస్ట్రీలో హఠాన్మరణం చెందిన నటులు వీళ్ళే..!ఇండస్ట్రీలో హఠాన్మరణం చెందిన నటులు వీళ్ళే..!actors;chiranjeevi;irrfan khan;shankar nag;soundarya;sushant singh;anand malayalam actor;bharathi old;jeevitha rajaseskhar;m s narayana;shankar;srihari;sushanth;tiru;tirupathi swamy;bollywood;telugu;tirupati;tamil;jayalakshmi;husband;comedian;hero;anand deverakonda;divya bhatnagarThu, 13 May 2021 09:45:24 GMTఇండస్ట్రీలో చాలా మంది నటులు కెరీర్ లో మంచిగా రాణిస్తున్న సమయంలోనే అర్దాంతరంగా మృతి చెందారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా. ఇక టిఎన్ఆర్ కెరీర్ చాలా బాగా నడుస్తున్న సమయంలో.. నటుడిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న సమయంలో జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ కరోనాతో కన్నుమూసాడు. తమిళంలో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే కరోనాతో కన్నుమూసాడు కేవీ ఆనంద్. కన్నడలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న సమయంలో కేవలం 35 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించాడు చిరంజీవి సర్జ.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇర్ఫాన్ ఖాన్ ని కాన్సర్‌ ఈ నటుడిని కాటేసింది. 54 ఏళ్ళ వయసులోనే కెరీర్ టాప్ ఫామ్‌లో ఉన్నపుడు కన్నుమూసాడు ఇర్ఫాన్ ఖాన్.  రియల్ స్టార్ శ్రీహరి తెలుగులో స్టార్‌గా ఉన్న సమయంలోనే కన్నుమూసాడు. చనిపోయే నాటికి ఈయన చేతిలో 15 సినిమాలున్నాయి. లెజెండరీ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కూడా కెరీర్ మంచి స్టేజీలోనే చనిపోయారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై యశో సాగర్. ఆయన బిజీ అవుతున్న సమయంలో రెండో సినిమాకే 25 ఏళ్ల వయసులో యశో సాగర్ యాక్సిడెంట్‌లో మరణించాడు.

అలాగే 19 ఏళ్ళ వయసులో జీవితంలో ఏం చూడకముందే స్టార్ డమ్ చూసింది దివ్య భారతి. కెరీర్ అప్పుడప్పుడే ఊపందుకుంటున్న సమయంలో ప్రత్యూష అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. 2002లో ఈమె మరణించే నాటికి వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. అప్పటికే 100 సినిమాలు పూర్తి చేసిన సౌందర్య స్టార్ హీరోయిన్‌గా ఉన్నపుడే విమాన ప్రమాదంలో కన్నుమూసారు. చనిపోయే నాటికి ఈమె వయసు 34 ఏళ్ళు మాత్రమే.  తెలుగు, తమిళంలో స్టార్‌గా దూసుకుపోతున్న సమయంలోనే చాలా చిన్న వయసులో అర్ధాంతరంగా మరణించారు ఫటాఫట్ జయలక్ష్మి.

సుత్తి వీరభద్రరావు అనారోగ్యంతో 45 ఏళ్ల వయసులోనే మరణించారు. కన్నడలో సూపర్ స్టార్‌ శంకర్ నాగ్ 35 ఏళ్ళ వయసులో 1990లో కన్నుమూసారు ఈయన. శంకర్ చనిపోయిన నాలుగేళ్ళ వరకు ఆయన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. సెల్యూట్, ఆజాద్, గణేష్ లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు తిరుపతి స్వామి.. చాలా చిన్న వయసులోనే కారు ప్రమాదంలో మరణించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>