PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd6599a7d-f787-4e8f-be32-7d5d179d327e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd6599a7d-f787-4e8f-be32-7d5d179d327e-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ విసురుతున్న పంజా నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలలో ఒక మార్గం వ్యాక్సినేషన్ అని చెప్పవచ్చు. గత సంవత్సరం కరోనా వైరస్ రాగానే అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారు చేసే దిశగా అడుగులు వేశాయి. వారితో పాటుగా ఇండియా కూడా వ్యాక్సిన్ తయారుచేయడంలో సఫలం అయింది.CORONAVIRUS;poorna;india;canada;population;coronavirus;panjaaమీరు సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? జరిగేదిదే ?మీరు సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? జరిగేదిదే ?CORONAVIRUS;poorna;india;canada;population;coronavirus;panjaaThu, 13 May 2021 14:00:00 GMTకరోనా వైరస్ విసురుతున్న పంజా నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలలో ఒక మార్గం వ్యాక్సినేషన్ అని చెప్పవచ్చు. గత సంవత్సరం కరోనా వైరస్ రాగానే అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారు చేసే దిశగా అడుగులు వేశాయి. వారితో పాటుగా ఇండియా కూడా వ్యాక్సిన్ తయారుచేయడంలో సఫలం అయింది. ఈ వార్తతో ఒక్కసారిగా భారతదేశ ప్రజలు ఎంతో ఆశ పడ్డారు. ఇక వ్యాక్సిన్ వచ్చేసిందని సంబరపడ్డారు. అయితే ఈ వ్యాక్సిన్ ను భారత ప్రభుత్వం ప్రజలందరికీ అందించడంలో సంపూర్ణంగా విఫలం అయింది. మన దేశంలో ఉన్న మొత్తం జనాభా 139 కోట్లు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి లెక్క చూస్తే కేవలం 20 కోట్లకన్నా తక్కువే అని తెలుస్తోంది. వీరిలో చాలా మంది ఇంకా సెకండ్ డోస్ వేసుకోకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కానీ వైద్య నిపుణుల సలహా ప్రకారం అలాగే వ్యాక్సిన్ నిబంధనల ప్రకారం ఫస్ట్ డోస్ వేసుకున్న 40 రోజుల తరువాత సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉంది. కానీ వ్యాక్సిన్ లు అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్ ప్రకారం సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ జరగడంలేదన్నది అధికారిక సమాచారం. అయితే ప్రజలు మాత్రం సెకండ్ డోస్ కోసం దగ్గర్లోని సచివాలయాలకు వెళ్లి గగ్గోలు పెడుతున్నారు. ఒకవేళ సెకండ్ డోస్ సమయానికి తీసుకోకపోతే మొదటి డోస్ ప్రభావం తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా పలు రకాల సందేహాలతో ప్రజలు మానసికంగా బాధపడుతున్నారు. సెకండ్ డోస్ వేసుకోని వారి పరిస్థితి ఇలా ఉంటే, ఇక అసలు మొదటి డోసు కూడా పొందని ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

కనీసం ఫస్ట్ డోస్ వేసుకుంటే అయినా కరోనా రాకుండా జాగ్రత్త పడొచ్చని భావిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే ఇప్పుడల్లా అందరికీ వ్యాక్సిన్ లు పూర్తిగా అందేలా అనిపించడం లేదు. మన దేశంలో అందరికీ సరిపడే విధంగా ఉత్పత్తి సామర్ధ్యం లేదు. ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం ప్రజల బాధలు వర్ణనాతీతం అని చెప్పాలి. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య కావడంతో ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చేయాలి. తాజాగా ఈ విషయంపై ప్రముఖ వ్యాక్సినోలజిస్ట్ గగన్ దీప్ సెకండ్ డోస్ కోసం వేచి చూసే వారికి సంతోషం కలిగించే వార్తను చెప్పారు. కెనడా వంటి దేశాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్  వేసుకున్న వారికి రెండవ డోస్ గడువు కాలం 16 వారాలుగా ఉందని చెప్పారు. కాబట్టి మొదటి డోస్ వేసుకున్న వారు ఎటువంటి ఆందోళన చెందవద్దని గగన్ దీప్ తెలిపారు.




 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లల కొరకు MP సర్కార్ కీలక నిర్ణయం..!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>