TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bullipeata-oxicare-vavastha-eala-panichastundho-telusa2497c90a-5662-43f6-bc21-3a21ccbc97ac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bullipeata-oxicare-vavastha-eala-panichastundho-telusa2497c90a-5662-43f6-bc21-3a21ccbc97ac-415x250-IndiaHerald.jpgకరోనా ఫస్ట్ వేవ్ కారణంగా కేవలం పాజిటివ్ కేసులు మాత్రమే తేలాయి. ఇక సెకండ్ వేవ్ కారణంగా ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. పిట్టల కదా రాలినట్టు ప్రజల శవాలు దిబ్బలు దిబ్బలుగా పెరిగిపోతున్నాయి. ఇటీవల స్మశానాలు కూడా హౌస్ఫుల్ బోర్డ్ లను పెడుతుండటం గమనార్హం. ఇక ఏ స్థాయిలో కరోనా మృతులు తేలుతున్నాయో అర్థం అవుతోంది. కొంతమంది కరోనా, మరి కొన్ని ఇతర కారణాల చేత చనిపోతే, మరికొంతమంది సరిగా ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక ఇలాంటి సమస్యలను అరికట్టడానికిOXYCARE;manya;oxygenబుల్లిపిట్ట: ఆక్సీకేర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసా ?బుల్లిపిట్ట: ఆక్సీకేర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసా ?OXYCARE;manya;oxygenThu, 13 May 2021 13:00:00 GMT
కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా కేవలం పాజిటివ్ కేసులు మాత్రమే తేలాయి. ఇక సెకండ్ వేవ్ కారణంగా ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. పిట్టల కదా రాలినట్టు ప్రజల శవాలు దిబ్బలు దిబ్బలుగా పెరిగిపోతున్నాయి. ఇటీవల స్మశానాలు కూడా హౌస్ఫుల్ బోర్డ్ లను  పెడుతుండటం గమనార్హం. ఇక ఏ స్థాయిలో కరోనా మృతులు తేలుతున్నాయో అర్థం అవుతోంది. కొంతమంది కరోనా, మరి కొన్ని ఇతర కారణాల చేత చనిపోతే, మరికొంతమంది సరిగా ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక ఇలాంటి సమస్యలను అరికట్టడానికి అందుబాటులోకి వచ్చింది ఆక్సీ కేర్ వ్యవస్థ.. అయితే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రూపొందించిన "ఆక్సికేర్‌ వ్యవస్థ "ను కొనుగోలు చేయడానికి పీఎం కేర్స్‌ ఫండ్‌ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.322.5 కోట్ల ఖర్చుతో 1,50,000 యూనిట్ల ఆక్సికేర్ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. SpO2 ఆధారిత ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థనే ఆక్సికేర్‌ సిస్టమ్‌ అని డీఆర్‌డీవో పేర్కొంది. SpO2 స్థాయిల ఆధారంగా రోగులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడాన్ని ఈ వ్యవస్థ నియంత్రిస్తుంది.

ఆక్సికేర్‌ సిస్టం..మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తుంది. రోగికి అవసరమైన ఆక్సిజన్‌ను , అతని శరీరంలోని SpO2 లెవల్స్‌ ఆధారంగా సరఫరా చేయడం దీని ప్రత్యేకత. ఈ పద్ధతి ద్వారా ఆక్సిజన్‌ వృథాను అరికట్టడంలో  సహాయపడుతుంది. అంతేకాకుండా హెల్త్‌కేర్‌ ఉద్యోగులపై పనిభారాన్ని కూడా ఆక్సికేర్‌ వ్యవస్థ  తగ్గిస్తుంది.

ఈ సిస్టమ్‌ ద్వారా ఆక్సిజన్‌ సర్క్యులేషన్‌ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం కూడా లేదు. సాధారణ మెడికిల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్‌ సరఫరాను మాన్యువల్‌గా నియంత్రించాల్సి ఉంటుంది. సరికొత్త ఆక్సికేర్‌ సిస్టమ్‌ ద్వారా పేషెంట్‌లోని SpO2 స్థాయిలను పర్యవేక్షిస్తూ ఆక్సిజన్‌ సరఫరా ను  నియంత్రిస్తుంది. ఇక త్వరలోనే ఈ ఆక్సీకేర్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోనాల్ గజ్జర్ బర్త్ డే స్పెషల్..

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>