EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/eetala-rajendarc9030686-4d47-43ec-ac5b-78a90138a0c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/eetala-rajendarc9030686-4d47-43ec-ac5b-78a90138a0c5-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై ప్రస్తుతానికి వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలుగానే తేలిపోయింది. ఆయన కొత్త పార్టీ పెడతారా, లేక ఇంకేదైనా పార్టీలో చేరతారా అనేది సస్పెన్స్ గా మారింది. గత కొన్నిరోజులుగా హుజూరాబాద్ లోనే మకాం పెట్టిన ఈటల, కొత్త పార్టీకోసం ప్రణాలికలు రచిస్తున్నారని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా ఇతర నేతలు ఆయనను కలసి తమ సంఘీభావం ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టినా, ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. ఆయనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ దశలో ఈటల కొత్త పార్టీ పెట్టడానికే eetala rajendar;allu aravind;revanth;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;telangana;congress;rajya sabha;mp;minister;professor;father;reddy;etela rajender;partyఎక్కే గడప.. దిగే గడప.. ఈటల తప్పు చేస్తున్నారా..?ఎక్కే గడప.. దిగే గడప.. ఈటల తప్పు చేస్తున్నారా..?eetala rajendar;allu aravind;revanth;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;telangana;congress;rajya sabha;mp;minister;professor;father;reddy;etela rajender;partyThu, 13 May 2021 14:00:00 GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై ప్రస్తుతానికి వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలుగానే తేలిపోయింది. ఆయన కొత్త పార్టీ పెడతారా, లేక ఇంకేదైనా పార్టీలో చేరతారా అనేది సస్పెన్స్ గా మారింది. గత కొన్నిరోజులుగా హుజూరాబాద్ లోనే మకాం పెట్టిన ఈటల, కొత్త పార్టీకోసం ప్రణాలికలు రచిస్తున్నారని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా ఇతర నేతలు ఆయనను కలసి తమ సంఘీభావం ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టినా, ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. ఆయనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ దశలో ఈటల కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గు చూపుతారనే ప్రచారం జరిగింది.

అయితే ఈటల హుజూరాబాద్ నుంచి హైదరబాద్ వచ్చి వరుసగా జాతీయ పార్టీల నేతలతో సమావేశం కావడం విశేషం. కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమైన మరుసటి రోజే బీజేపీ ఎంపీ అరవింద్, ఆయన తండ్రి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ తోనూ ఈటల మంతనాలు జరిపారు. డీఎస్ కొన్నాళ్లుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉన్నా.. ఆయన ప్రస్తుతం అదే పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొడుకు బీజేపీలో ఉండగా.. డీఎస్ ని టీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో లేదు. ప్రస్తుతం డీఎస్ తో ఈటల జరిపిన చర్చలు.. బీజేపీలో ఎంట్రీకోసమా అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఓరోజు కాంగ్రెస్, మరో రోజు బీజేపీ నేతలతో సమావేశమైన ఈటల.. లాభనష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో కూడా ఈటల సమావేశం అవుతారని కూడా తెలుస్తోంది. సొంత పార్టీ వ్యవహారాన్ని పక్కనపెట్టి.. ఎక్కే గడప, దిగే గడప అన్నట్టుగా ఉంది ఈటల వ్యవహారం. అటు తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈటలకు మద్దతుగా మాట్లాడారు. ప్రస్తుతానికి సొంత పార్టీ పెట్టి తెలంగాణలో మనగలిగే సత్తా ఈటలకు ఉందా లేదా అనేది కూడా అనుమానమే. గతంలో చాలామంది టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి వేరు కుంపట్లు పెట్టి నష్టపోయిన వారు ఉన్నారు. అందుకే ఈటల జాగ్రత్తగా అడుగు వేయాలనుకుంటున్నారు. ఒకవేళ జాతీయ పార్టీలోకి వెళ్లినా ఈటలకు సముచిత స్థానం ఉంటుందా అనేది కూడా డౌటే. ఇప్పటికిప్పుడు నష్టపోయినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవాలంటే ఈటల కొత్త పార్టీ పెట్టాల్సిందేనని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ పార్టీల్లోకి వెళ్లాలనుకోవడం తప్పా, ఒప్పా? అసలు ఈటల మనసులో ఏముంది అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లల కొరకు MP సర్కార్ కీలక నిర్ణయం..!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>