MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sameera-reddy-karona-recovery-tips2dc6a162-3dd3-4d71-be2a-83eff285cece-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sameera-reddy-karona-recovery-tips2dc6a162-3dd3-4d71-be2a-83eff285cece-415x250-IndiaHerald.jpgహీరోయిన్ సమీరా రెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. తన జీవితంలో జరిగిన విషయాలని,విశేషాలను అందరితో పంచుకుంటూ వస్తుంది.అలాగే ఈ మధ్య కాలంలోనే సమీరా రెడ్డి కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడి అందరూ కూడా ఐసోలేషన్ లోకి వెళ్ళి కోవిడ్ కి సంబందించిన జాగ్రత్తలు తీసుకుని ఆ మహమ్మారి బారి నుండి సురక్షితంగా బయటపడ్డారు. అలా కరోనా వైరస్ నుండి కోలుకున్నాక చాలా మందిలో అనేక బలహీనతలు కలుగుతున్నాయి. మరి అలాంటి బలహీనతలు తగ్గించడానికి ఎలాంటి టిప్స్ పాటిస్తే త్వరగా రికవరీ అవుతారోSameera reddy, karona, recovery tips;jeevitha rajaseskhar;rakshita;bari;smart phone;vitamin c;television;vitamin;heart;letter;heroine;almonds;nijam;indian gooseberry;reddy;kaala;coronavirusకరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !Sameera reddy, karona, recovery tips;jeevitha rajaseskhar;rakshita;bari;smart phone;vitamin c;television;vitamin;heart;letter;heroine;almonds;nijam;indian gooseberry;reddy;kaala;coronavirusThu, 13 May 2021 17:30:00 GMT

హీరోయిన్ సమీరా రెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. తన జీవితంలో జరిగిన విషయాలని,విశేషాలను అందరితో పంచుకుంటూ వస్తుంది.అలాగే ఈ మధ్య కాలంలోనే సమీరా రెడ్డి కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడి అందరూ కూడా  ఐసోలేషన్ లోకి వెళ్ళి కోవిడ్ కి సంబందించిన జాగ్రత్తలు తీసుకుని ఆ మహమ్మారి బారి నుండి సురక్షితంగా  బయటపడ్డారు. అలా కరోనా వైరస్ నుండి కోలుకున్నాక చాలా మందిలో అనేక బలహీనతలు కలుగుతున్నాయి. మరి అలాంటి బలహీనతలు తగ్గించడానికి ఎలాంటి టిప్స్ పాటిస్తే త్వరగా రికవరీ అవుతారో అనే కొన్ని విషయాలను సమీరా రెడ్డి చెప్పింది. మరి ఆ టిప్స్ ఏంటి అనేవి ఒకసారి చూద్దాం.



కోవిడ్ బారి నుండి బయట పడ్డాక  వీలయినన్ని ఎక్కువ సార్లు కొబ్బరి నీళ్ళూ తాగుతూ ఉండాలి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి, నిమ్మ జ్యూస్ లను ఎక్కువగా తాగాలి. అలాగే ఖర్జూరం, కాలా జామూన్ తో పాటు రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్ష, బాదం పప్పులను  తింటూ ఉండాలి. అలాగే ప్రతి రోజు ఆహారంలో భాగంగా తాజా పండ్లని తినాలి.తీసుకునే ఆహారంలో ఎక్కువగా   బెల్లం, నెయ్యిని కలుపుకోవాలి. అలాగే పప్పు ధాన్యాలు, కిచిడి, కూరగాయలు ఎక్కువగా తినాలి.



ఎట్టి పరిస్థితులలో ప్రాసెస్ చేసినా ఆహారాలు, రిఫైన్ చేసిన,  బాగా వేపిన ఆహార పదార్ధాలు అస్సలు తినకూడదు. అలాగే ఎక్కువగా ఫోన్ వాడడం చేయకూడదు.అలాగే టీవీ చూసే అలవాటు ఉంటే బాగా తగ్గించాలి. శరీరానికి తగినంత విశ్రాంతితో పాటు కావాల్సినంతగా నిద్రపోవాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రోజూ పొద్దున్న లేచి కనీసం 15నిమిషాల పాటైనా ఎండలో నిల్చోవాలి.అతిగా వ్యాయామాలు చేయకూడదు. మీ మనసులో ఉన్న ఆలోచనలని, అపోహలు, భయాలను ఎదుటి వ్యక్తితో పంచుకుంటే సాధ్యమైనంత వరకు మీ గుండె భారం తగ్గుతుంది.పైన తెలిపిన విషయాలు అన్ని సమీరా రెడ్డికి బాగా ఉపయోగపడ్డాయని తెలిపింది. కరోనా తర్వాత బలహీనతతో బాధపడేవారికి సమీరా సలహాలు నిజంగానే మంచి చిట్కాలు అని చెప్పవచ్చు. ఇంకా కావాలనుకుంటే మీ వైద్యుడిని సంప్రదించండని సమీరా చెప్పుకొచ్చింది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్ళీ మ్యూజిక్ మొదలు పెట్టిన లోకేష్

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>